లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ మూత‌ప‌డ‌టంతో క‌రెంటుకు డిమాండ్ ప‌డిపోయింది. ఎంత‌లా అంటే గ్రిడ్‌ మేనేజ్‌మెంట్‌కు సమస్య త‌లెత్తే అంతలా. గ‌తంలో ఎప్పుడు ఎదురుకాని ప‌రిస్థితి ఇది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యుత్‌ డిమాండ్‌ గురువారం ఊహించని విధంగా పడిపోయింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మునుపెన్నడూ లేని విధంగా 120 మిలియన్‌ యూనిట్లుగా నమోదైంది. ఈ పరిణామంపై విద్యుత్‌ ఉన్నతాధికారులు శుక్రవారం క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకునే ప‌నిలో ఉన్నారు. దీనికి తోడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  గురువారం వీచిన గాలులు, వర్షానికి పలు జిల్లాల్లో భారీగా విద్యుత్‌ అంతరాయాలు చోటు చేసుకు న్నాయి.

 

లాక్‌డౌన్‌ కారణంగా వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ తగ్గిపోయి రోజుకు 150 మిలియన్‌ యూనిట్లు నమోదవుతోంది. గాలి దుమ్ము వల్ల ఇది 120 మిలియన్‌ యూనిట్లకు చేరింది. వర్షం కారణంగా వ్య‌వ‌సాయానికి రైతులు కూడా  విద్యుత్ మోటార్లు వాడ‌లేదు. విద్యుత్ వినియోగంలో భారీ హెచ్చు త‌గ్గుద‌లలు చోటు చేసుకుంటే  గ్రిడ్‌ మేనేజ్‌మెంట్‌కు సమస్య ఏర్ప‌డుతుంద‌ని లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ) ఇంజినీర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేందుకు మూడు నెలల పాటు విద్యుత్ బిల్లుల్ని కూడా వాయిదా వేయాలని కేంద్రం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 


 ఎటువంటి జరిమాన లేకుండా మూడు నెలల తర్వాత బిల్లులు చెల్లించే అవకాశం కల్పించింది.  ఇదిలా ఉండ‌గా లాక్‌డౌన్ నుంచి క‌నీసం ప‌రిశ్ర‌మ‌ల‌కు మిన‌హాయింపు ఇవ్వాల‌ని ప‌రిశ్ర‌మ‌ల సంఘాల నాయ‌కులు ప్ర‌భుత్వానికి విన్న‌విస్తున్నారు. దీనివ‌ల్ల కార్మికుల‌కు ఉపాధి దొర‌క‌డంతో పాటు ఉత్ప‌త్తి జ‌రిగి నిత్యావ‌స‌రాలు మార్కెట్లోకి చేరుతాయ‌ని చెబుతున్నారు. అయితే ఈనెల 14త‌ర్వాత మ‌రో వారం పాటు పొడిగించి ఆ త‌ర్వాత స‌డ‌లింపు ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే అదీ కూడా అనేక ఆంక్ష‌ల‌తో...క‌రోనా త‌గ్గ‌ముఖం పట్టింద‌ని భావిస్తేనే జ‌రుగుతుంద‌ని స‌మాచారం. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: