దేశంలో గత నెల 24 నుంచి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. చైనా తర్వాత ఈ కరోనా వైరస్ తో ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాలో ఆర్థిక నష్టమే కాదు.. ప్రాణ నష్టం కూడా బాగా పెరిగిపోయింది.  క్షణ క్షణం అగ్రరాజ్యలు సైతం భయం గుప్పిట్లో బతికే పరిస్థితి ఏర్పడింది. కరోనా విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. అది ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లిపోతుంది.  దాంతో ప్రపంచంలో కొన్ని దేశాలు సీరియస్ గా లాక్ డౌన్ ప్రకటించాయి.  వాస్తవానికి చైనాలో ఈ వైరస్ వ్యాప్తి చెందే సమయంలో లాక్ డౌన్ పాటించడంతో కాస్త ఊరట లభించిందనే చెప్పొచ్చు.  ఈ కరోనా పుట్టిన పుహాన్ లో ఏకంగా 75 రోజుల పాటు లాక్ డౌన్ పాటించారట. అయితే మన దేశంలో కరోనా నిర్మూలన పూర్తి స్థాయిలో కాలేదు.

 

దేశంలో కరోనా వైరస్  విజృంభిస్తోన్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ఎత్తివేతపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అయితే లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ పాటు 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. ఆరోగ్య సేతు యాప్‌ను ప్రారంభించడంపై ప్రశంసలు కురిపించారు.  లాక్‌డౌన్‌తో రాష్ట్రాల ఆదాయం తగ్గిపోయిందని, కరోనాను ఎదుర్కొనేందుకు నిధులు అందించాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కోరారు. పశ్చిమ బెంగాల్‌ జీడీపీ పడిపోయిందని ఆమె చెప్పారు.

 

కర్ణాటకలో కొవిడ్‌-19 కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో కరోనా కట్టడి వ్యూహాలను వివరించానని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. ప్రభుత్వానికి తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భఘెల్ మోదీకి చెప్పారు. లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు  అనుగుణంగా వ్యవహరిస్తామన్నారు. నేడు ప్రజలను ఉద్దేశించి ప్రధాని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. 
 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: