భారతీయ సామాజిక కార్యకర్తగా, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్తగా, రచయితగా బడుగు, బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడి... వారిలో ఆత్మస్థైర్యం కల్పించిన మహనీయుడు జ్యోతిబా పూలే. కోట్లాదిమంది ప్రజానీకం కోసం పూలే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. హిందూ మతంలోని స్త్రీలలో, నిమ్న కులాలలో పూలే చైతన్యం తీసుకొచ్చారు. హిందూ సమాజంలోని సమానత్వం సాధించే పోరాటమే స్వాతంత్ర పోరాటం కంటే గొప్పదని పూలే భావించారు. 
 
సమాజంలో కులాల మధ్య ఎక్కువ, తక్కువ అనే భేద భావం ఉండకూడదని ఎటువంటి భేదాలు లేని సార్వజనీన మతం స్థాపించాలని పూలే కలగన్నారు. పూలే దేశాభివృద్ధి మానవ సమానత్వం తర్వాత సాధించిన ఐక్యత ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పూలే భావించారు. పూలే ఒక బ్రాహ్మణ మిత్రుని పెళ్లికి హాజరైన సమయంలో స్నేహితుల బంధువుల నుంచి వివక్ష ఎదురైంది. అప్పుడే పూలే మనుషులను కుల అడ్డుగోడలు ఎలా విడదీశాయో అర్థం చేసుకున్నాడు. 
 
పూలే సామాజిక అక్షరాస్యత ద్వారా మాత్రమే సమాజంలో ఈ అసమానతలు తొలగిపోతాయని పూలే భావించారు. పూలే మొదట తన భార్య సావిత్రి బాయి పూలేకు విద్య నేర్పారు. భ్రూణ హత్యకు సిద్ధపడిన బ్రాహ్మణ వితంతువు కొడుకు పూలే దంపతులు పెంచి పెద్ద చేసి డాక్టర్ ను చేశారు. పూలే స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని ఆకాంక్షించారు. పూలే తన జీవితాన్నే సమాజం కోసం ధారబోశారు. 
 
శూద్రులను బ్రాహ్మణ చెర నుండి కాపాడాలనే ఉద్దేశంతో పూలే 1873 సెప్టెంబరు 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించారు. ఈ సంస్థలోని సభ్యులు పూరోహితుని అవసరం లేకుండా దేవుణ్ణి పూజించేవారు. పూలే 1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనంను ప్రారంభించారు. దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని కోరుకున్నారు. దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం అని పూలే చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: