కరోనా వైరస్ భారత్ పైన కూడా పంజా విసిరింది. ఈ మహమ్మారి నుండి భారత దేశ ప్రజలను కాపాడుకోవటం లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే దేశంలో కరోనా కొన్ని రాష్ట్రాల్లో తన ప్రభావాన్ని చూపిస్తుందని.. కొన్ని రాష్ట్రాల్లో దీని తీవ్రత పెద్దా లేదని అంటున్నారు.  అయితే  కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈశాన్యవాసులపై దేశంలోని ఇతర ప్రాంతాల్లో జాతివిద్వేష దాడులు జరుగుతున్నాయని, వీటిని వెంటనే ఆపాలని అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నినాంగ్‌ ఎరింగ్‌ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.   

 

కొంత మంది కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. బౌతిక దాడులు కూడా వారిపై చేస్తున్నారని.. ముఖ్యంగా తూర్పు ఆసియావాసులను పోలిఉండే ఈశాన్య రాష్ట్రాల పౌరులపై దేశంలోని అనేక చోట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.  అయితే మేరా భారత్ మహాన్.. భారతీయులంతా ఒక్కటే అన్న నినాదంతో ముందుకు సాగుతున్నామని.. ఇలాంటి సమయంలో ఈ ప్రాథమిక సూత్రాలను మర్చిపోయి తమ రాష్ట్ర పౌరులను అవమానిస్తున్నారని ఎరింగ్‌ తన లేఖలో ఆవేదన వ్యక్తంచేశారు.

 

చాలా రాష్ట్రాల్లో ఈశాన్యవాసులను కరోనా అని వైరస్‌ అనే పేర్లతో సంబోధిస్తూ అవమానిస్తున్నారని తెలిపారు. కరోనా అరికట్టేందుక ప్రతి భారత పౌరుడు తన విధిని తప్పకుండా పాటించాలని కోరారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నా కొంత మంది ఉల్లంఘన కి పాల్పపడుతున్న విషయం తెలిసిందే. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: