ముంబైపై  పంజా విసురుతున్న కరోనా మ‌హమ్మారి..వైద్యులను కూడా వ‌ద‌ల‌డం లేదు.  ముంబైలో కరోనా వైరస్ బాధితులు పెరుగుతుండగా.. హాస్పిటల్స్ మూతపడుతున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం క‌రోనా వైర‌స్‌కు గురైన వారు కూడా చికిత్స వ‌స్తుండ‌టంతో స‌రైన ర‌క్ష‌ణ లేకుండానే చికిత్స నిర్వ‌హిస్తున్న వారు వ్యాధికి గుర‌వుతున్నార‌ని స‌మాచారం. ముంబయి నగరంలోని వివిధ హాస్పిటల్స్‌లో దాదాపు 100 మంది వైద్య సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావ‌డం గ‌మ‌నార్హం. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా వైరస్ బాధితులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బంది ఈ మహమ్మారి బారినపడుతుండ‌టంపై ప్ర‌భుత్వ వ‌ర్గాల్ల‌నూ ఆందోళ‌న మొద‌లైంది. 

 

మహారాష్ట్రలో మొత్తం 1,600పైగా కేసులు నిర్ధారణ కాగా.. ఒక్క ముంబైలోనే దాదాపు 900 కేసులు నమోదయ్యాయి. గడచిన 12 గంటల్లోనే కొత్తగా మరో 92 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఒక్క ముంబయి మహా నగరంలోనే 72 కేసులు నిర్ధారణ కావ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున్న కరోనా బారినపడుతుండటంతో వారి కోసం అత్యవసరంగా రక్షణ కిట్‌లు, అదనపు వేతనాలు, రవాణా సదుపాయాలు కల్పించాలని ప్రయివేట్ హాస్పిటల్స్ కోరుతున్నాయి. భాటియా హాస్పిటల్ బుధవారం నుంచి కంటెయిన్‌మెంట్ జోన్‌లోనే కొన‌సాగుతోది. 

 

 ఈ హాస్పిటల్‌లో 10 మంది నర్సులు, ఇద్దరు డాక్టర్లు, ఓ ఫిజియోథెరపిస్ట్ సహా మొత్తం 14 మంది సిబ్బంది వైరస్ బారినప‌డ‌టం గ‌మ‌నార్హం.  అలాగే దాదర్‌లోని షుష్రూష హాస్పిటల్‌లో ఇద్దరు నర్సులకు వైరస్ సోకింది. బ్రీచ్ క్యాండీలో సేవలు స్వల్పంగా కొనసాగుతున్నాయి.  ఇలాంటి విప‌త్క‌ర స‌రిస్థితుల్లో న‌ర్సులు, డాక్ట‌ర్లు  వైద్యం చేయ‌డానికి ముందుకు రాక‌పోతే  ప‌రిస్థితి ఏంటీ అన్న సందేహాలు వారిలో మొద‌ల‌య్యాయి. అందుకే ఇప్ప‌టికే యుద్ధ ప్రాతిప‌దిక చ‌ర్య‌ల‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు మొద‌లుపెట్టింది. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాల‌కు చెందిన వైద్య సిబ్బంది, డాక్ట‌ర్ల జాబితాను సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: