లాక్‌డౌన్‌ లేకుంటే కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండేదని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా ధాటికి ఇప్పటి వరకు దేశంలో 239 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. లాక్​డౌన్​ వల్లే కేసుల సంఖ్య తక్కువగా ఉందని.. లేకపోతే ఈపాటికే 2 లక్షలు దాటిపోయేదని స్పష్టం చేసింది. ప్రాణాంతక కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ఆరోగ్యశాఖ పునరుద్ఘాటించింది.  దేశవ్యాప్తంగా ఇప్పటికే లక్షకుపైగా ఐసోలేషన్​ బెడ్లు అందుబాటులో ఉన్నాయని.. కేవలం వైరస్​ రోగుల చికిత్స కోసేం 586 ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్టు వివరించింది. 

 

ఇప్పటివరకు మొత్తం 1.7లక్షల మందిని పరీక్షించినట్టు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​ వెల్లడించారు.  శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 16,500 కరోనా పరీక్షలు జరిగినట్టు వివరించారు.. 24 గంటల్లో 1035 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు..దేశవ్యాప్తంగా కరోనా నుంచి 642 మంది బాధితులు కోలుకున్నారని వివరించారు. విపత్కర పరిస్థితుల్లో లాక్​డౌన్​ కఠినంగా అమలు చేయడం ఎంతో ముఖ్యమన్నారు లవ్​ అగర్వాల్​. దేశం లాక్​డౌన్​లో ఉన్నందువల్లే కేసులు తక్కువగా ఉన్నాయని.. లేకపోతే ఈపాటికే 2లక్షలు దాటిపోయేవని అభిప్రాయపడ్డారు..

 

భారత్‌లో మొత్తం 7,447 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయన్నారు. గత 24 గంటల్లో 1,035 కొత్త కేసులు నమోదు కాగా, ఇవాళ ఒక్కరోజే 40మంది మృత్యువాత పడ్డారు.  కాగా ఈ నెల 14తో లాక్‌డౌన్‌ ముగియనుంది. రాష్ట్రాల అభ్యర్థలతో ఈ నెల 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పంజాబ్‌, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకూ పొడిగించింది.  ఇదిలా ఉండ‌గా గ‌డిచిన 24గంట‌ల్లో భారీగా కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌టంపై ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ప్ర‌ధాని మోదీతో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: