దేశంలో లాక్‌డౌన్ ప్రకటించి ఇరవై రోజుల దెగ్గర నుండి నడుస్తుంది. అయితే ఈ లాక్ డౌన్ ఎంత పకడ్బందీగా అమలవుతున్నా.. భారత ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నా.. కరోనా కేసుల సంఖ్య మాత్రం రోజురోజకి కొత్తగా పెరుగుతున్నాయి. అయితే దేశంలో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 1035 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వగా... మరో 40 మంది మృత్యు వాత పడ్డారు. 

 


ప్రస్తుతం దీని ఫలితంగా భారత్ లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,447 కు చేరింది. అయితే ఇక్కడ కాస్త సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ఇందులో  ఇప్పటి వరకు 643 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అంతే కాకుండా ఇంతవరకు సమాచారం తెలిసే సరికి  మొత్తం 239 మంది మృత్యు వాత పడ్డారు. దానితో భారత్‌ లో ప్రస్తుతం మొత్తం గా 6,565 యాక్టివ్ కేసులున్నాయి. 

 


అయితే, గత 48 గంటల్లో భారత్ లో ఏకంగా 1,487 కొత్త కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఇంకోవైపు ఎలాంటి పరిస్థితినైనా ఎదురుకొని నిలబడేందుకు దేశం సిద్ధంగా ఉందని... అందుకోసం ఒక లక్ష ఐసొలేషన్ బెడ్లు సిద్ధం చేశామని ఆయన తెలిపారు. అయితే ఇప్పటి వరకు భారత్ లో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్ర రాష్ట్రంలో నమోదయ్యాయి. మహారాష్ట్ర రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 1666 కేసులు నమోదు అవ్వగా... అయితే ఇంతవరకు అక్కడ కరోనా మహమ్మారి దెబ్బకి ఆ రాష్ట్రంలో 110 మంది చనిపోయారు. ఇక ఢిల్లీలో ఇప్పటి వరకు 903 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా అందులో 27 మంది కోలుకోగా, 14 మంది మరణించారు. ఇక దక్షిణాన తమిళనాడు రాష్ట్రంలో 911 కేసులు నమోదు అవ్వగా.. 44 మంది కోలుకోగా, అందులో 9 మంది చనిపోయారు. ఇక ఆ తర్వాత స్థానంలో  తెలంగాణ రాష్ట్రములో 487 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 45 మందికి నయం కాగా, అందులో 12 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: