స్వల్ప బలంతో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అనేక కుయుక్తులు పన్నుతూ ప్రభుత్వాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికార పార్టీ నేతలు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు. చంద్రబాబు చేసినట్టు సీఎం జగన్...ఆ పార్టీలో ఉన్న నాయకులను వైసీపీలో చేర్చుకుంటే చంద్రబాబు కి ప్రతిపక్ష పదవి కూడా ఉండదని అప్పట్లో అనడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న టైంలో బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి సహకరించాలని...కానీ ప్రతిసారీ చంద్రబాబు రాజకీయం చేయడానికి మొగ్గుచూపుతున్నారు. అందువల్లనే ఆయన రాజకీయ అరాచకాలకు చాలామంది బలైపోయారు. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా బలైపోయాడు అని అంటున్నారు.

 

స్థానిక ఎన్నికలు వాయిదా వేయటం వెనకాల నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్లానింగ్ వెనకాల మొత్తం తెలుగుదేశం పార్టీ స్క్రిప్టు ఉందన్నారు. ఒక స్థానిక ఎన్నికలు మాత్రమే కాకుండా ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలలో చంద్రబాబు అనేక ఇబ్బందులకు ఏపీ ప్రభుత్వాన్ని గురి చేయడం జరిగింది. రాజ్యాంగబద్ధ పదవిలో తన మనుషులను పెట్టి రాష్ట్ర రాజకీయాలలో అరాచకాలు సృష్టించడానికి రెడీ అవటం 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు.

 

విభజనతో నష్టపోయి అనేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రంలో పరిపాలన చేయాలంటే కచ్చితంగా ఎక్కడికక్కడ అవినీతిని, అడ్డగోలు తనంగా వ్యవహరించే అధికారులను సస్పెండ్ చేయటం ఒక్కటే సరైన దారి అని వైసీపీ నేతలు అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సస్పెండ్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో చంద్రబాబు మనుషులు గవర్నమెంట్ సెక్టార్ లో ఎక్కడ ఉన్నా భయపడటం గ్యారెంటీ అని జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని సస్పెండ్ చేయడంలో తప్పేమీ లేదని వైసీపీ నేతలతో పాటు రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన కొంత మంది సీనియర్ రాజకీయ నేతలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: