ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ బాగా పెరిగిపోతున్నాయి. వైరస్ ని అరికట్టడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కానీ ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోకుండా వారికి తోచినట్లు వాళ్ళు బయట తిరుగుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే గత రెండు వారాల నుంచి పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవడం జరిగింది. ప్రస్తుతం కరోనా వైరస్ తో పెద్ద యుద్ధమే చేస్తున్నామని చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ సమయంలో విద్యార్థులు రైతులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు నటి నటులు అందరూ కూడా తమ వంతు సహాయాన్ని అందజేస్తూ దేశానికి అండగా నిలబడుతున్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ సహాయనిధి కూడా సహాయం అందజేస్తూ అందరికీ కాస్త ధైర్యం ఇస్తూ నిలుస్తున్నాయి. 

 

 

తాజాగా ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ ఏర్పాటుచేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌ కు ప్రముఖ లావాదేవీల కంపెనీ పేటీఎం 100 కోట్లు విరాళంగా ఇచ్చింది. అంతేకాకుండా 500 కోట్ల సేకరణ లభ్యంగా పేటీఎం ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేసిందని తెలియజేయడం జరిగింది. దీని ద్వారా ఎవరైనా సరే విరాళాలు అందించవచ్చు అని కంపెనీ అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా ఎవరైనా సరే పేటియం ద్వారా ఇచ్చే విరాళానికి తమ కంపెనీ నుంచి అదనంగా 10 రూపాయలు కలుపుదామని సంస్థ తెలియజేయడం జరిగింది.

 


ఈ విషయంపై సంస్థ సీనియర్ అధికారులు పది రోజుల్లో 100 రూపాయలు వంద కోట్లు సమకూరుతాయని ఆయన తెలియజేశారు. అలాగే పేటీఎం ఉద్యోగులు సైతం విరాళాలను ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు. మరికొంత మంది విద్యుత్ ఉద్యోగులు అయితే వారి మూడు నెలల వేతనాన్ని కూడా విరాళాల నిధికి సమర్పించారని తెలిపాడు. ఇక దేశ ప్రజలంతా ముందు అడుగు వేసి పీఎం కేర్స్‌ ఫండ్‌ లో భాగస్వామ్యం అవ్వాలని పేటీఎం సంస్థ తెలియజేయడం జరిగింది. దీనితో పాటు పేదవారికి అందరికీ కేవీఎన్‌ ఫౌండేషన్‌ తో అనుసంధానమైన అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధంగా ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: