ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తున్న కరోనా వైరస్ విషయంలో అన్ని దేశాలను అప్రమత్తం చేస్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు కరోనా వైరస్ యొక్క మృతుల సంఖ్య అదేవిధంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య బయట ప్రపంచానికి అప్ డేట్ ఇస్తోంది.  ఈ నేపథ్యంలో చైనా యొక్క మృతుల సంఖ్య విషయంలో తైవాన్ భూభాగం లో చనిపోయిన మృతుల సంఖ్య తో కలిపి, చైనా దేశం లో ఎంత మంది చనిపోయారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల లెక్కలు చెప్పింది. దీంతో వెంటనే తైవాన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ పై మండి పడింది. మా ప్రాంతానికి సంబంధించి కరోనా వైరస్ లెక్కలు చైనా దేశంతో కలిపి చెప్పటం ఏమిటి అంటూ నిలదీస్తుంది.

 

అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా దేశానికి మద్దతు గా నిలుస్తుందని చెప్పుకొచ్చింది. వైరస్ కి సరిహద్దులు ఉండవని ఎక్కడైనా విస్తరిస్తుంది అని తెలిపింది. అందరిని అప్రమత్తం చెయ్యాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు హితవు పలికింది. దీంతో ఈ విషయంపై చైనా స్పందించింది. లేనిపోని ఆరోపణలు చేస్తూ తైవాన్ వాసులు స్వాతంత్రం కోసం వైరస్ ని వాడుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ నేపథ్యంలో ఒక ఉద్దేశపూర్వకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ని అడ్డంపెట్టుకుని సరికొత్త కుట్రకు, జాతి విద్వేషాలు రెచ్చగొట్టడానికి తైవాన్ వాసులు రెడీ అవుతున్నట్లు చైనా ఆగ్రహించింది.

 

అంతర్జాతీయ స్థాయిలో ఈ విషయం పెద్దది కావడంతో చాలా దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ పై విమర్శలు చేస్తున్నారు. ఎవరి దేశాల లెక్కలు వారికి చెప్పాలి గాని ఈ విధంగా రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించడం మంచిది కాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పై విమర్శలు వస్తున్నాయి. మరోపక్క ఇలాంటి చెత్త పనులు చేయాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కె చెల్లుతుంది అంటూ అమెరికా గట్టిగా విమర్శలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: