కరోనా మహమ్మారి దెబ్బకు ప్ర‌పంచం అత‌లా కుత‌లం అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే ప్ర‌పంచ వ్యాప్తంగా 17.14 ల‌క్ష‌ల మంది క‌రోనా బాధితులు ఉన్నారు. ఇక క‌రోనా మ‌ర‌ణాలు 1.03 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. ఇక అగ్ర రాజ్యం అమెరికాలో ప‌రిస్థితి ఘోరంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తుంటే ఆ ఒక్క దేశంలోనే 5.03 ల‌క్ష‌ల మంది కోవిడ్ బాధితులు ఉన్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ 18, 761 మంది మ‌ర‌ణించారు. ఇక అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ పరిస్థితి దారుణంగా మారింది. 

 

చివ‌ర‌కు న్యూయార్క్‌లో ఎక్కువ మంది మృతిచెంద‌డంతో ఎక్క‌డ చూసినా శ‌వాల కుప్ప‌లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మృతదేహాలను పూడ్చడానికి చోటు లేకపోవడంతో న్యూయార్క్‌లో బ్రాంక్స్‌ సమీపంలోని ఓ ద్వీపం (హార్ట్‌ ఐలాండ్‌)లో సామూహిక ఖననం చేశారు. భారీగా కరోనా మృతదేహాలను తెలుపు రంగు బాక్సుల్లో ఉంచి, ఒకేసారి ఒకదానిపైన ఒకటి కుప్పలు కుప్పలుగా పేరుస్తూ పూడ్చిపెట్టారు. అక్క‌డ మృతుల కుటుంబ స‌భ్యులు గాని, తెలిసిన వారు గాని ఎవ్వ‌రూ లేకుండానే అంత్య‌క్రియ‌లు చేశారు. ఇ‍ప్పటి వరకు  న్యూయార్క్‌ నగరంలోనే దాదాపు 1 లక్షా 59 వేల మంది కరోనా బారిన పడగా దాదాపు 7067 మంది మృతిచెందారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: