కరోనా వైరస్ దెబ్బకి సీఎం జగన్ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ ముహూర్తాన రాజకీయాల్లో అడుగు పెట్టాడో తెలియదు గానీ వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. రాజకీయాల్లో అడుగు పెట్టాక ఎంపీ అయ్యాక తండ్రి చనిపోవటం.., కాంగ్రెస్ పార్టీని వీడటం జరిగింది. ఆ తర్వాత వైసిపి పార్టీని స్థాపించడం వెంటనే ఆ దెబ్బతో జగన్ ని జైలు పాలు చేయడం, ఇలా వరుస వరుసగా జరిగాయి. అయినా గాని ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా తాను స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు వైయస్ జగన్. దాదాపు గతంలో ప్రతిపక్ష నేతగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వైఎస్ జగన్...కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేసి గత సంవత్సరం ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

 

విభజనతో నష్టపోయిన రాష్ట్రం, పైగా పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి కి ముఖ్యమంత్రి కావడం ...కరోనా వైరస్ రావటంతో  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జగన్. ఒకవైపు ఆర్థికభారం, మరోవైపు ప్రతిపక్ష ప్రశ్నలు, ఇంకోవైపు పరిశ్రమలు స్థాపించడం విషయంలో అవకాశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవటం తో జగన్ తో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సరిగ్గా ఎన్నికలు జరిగి గెలిచి ఏడాది అయ్యింది. ఇంకా మూడు సంవత్సరాలలో కరోనా వైరస్ కట్టడి చేయడంతో పాటు రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తాడు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

 

అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలు రాబోయే రోజుల్లో ఎలా నెరవేరుస్తారు అన్నది ఎవరికీ తెలియని పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయంకరంగా ఉండటంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం, ఆకలి చావులు అనేవి బాగా వినబడతాయి అని చాలామంది అంటున్నారు. మొత్తంమీద చూసుకుంటే రాబోయే నాలుగు సంవత్సరాలు జగన్ పరిపాలన కత్తి మీద సాములా గా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: