ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంభిస్తోంది. విరుగుడు లేని మహమ్మారి అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. కంటికి కనిపించకుండా దాడి చేసి ప్రాణాలను హరించుకుపోతుంది. ఇప్పటికే ఎంతో మందిని బలితీసుకుంది ఈ ప్రపంచ మొహమ్మరి . శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ మహమ్మారి కి విరుగుడు మాత్రం లభించడం లేదు... వెరసి రోజురోజుకు ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. మృత్యువుతో పోరాడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది . అయితే విరుగుడు లేని ఈ మహమ్మారి కి నివారణ ఒక్కటే మార్గం. మందులు లేని మహమ్మారి వైరస్ కు ... సామాజిక దూరమే ఒక మందు... వ్యక్తిగత పరిశుభ్రత సరైన విరుగుడు... ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ తమ ప్రజలకు సామాజిక దూరం  పాటించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలంటూ సూచిస్తున్నాయి. 

 

 

 అంతేకాకుండా ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యేలా కఠిన నిబంధనలను కూడా అమలు చేస్తున్నాయి. వ్యక్తులు కలుసుకోకుండా ఉండడం వల్ల సామాజిక దూరం పాటించడం వల్ల ఈ వైరస్ ను కట్టడి చేయవచ్చు అని పిలుపునిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ చాలా మంది ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చదువుకున్న వారు కూడా సామాజిక దూరం  పాటించడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసిన ఎంత బాధ్యతగా ఉండాల్సిన వారు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి . సమూహాలుగా ఉండకూడదు సూచిస్తుంటే... ప్రభుత్వం చెప్పింది పెడచెవిన పెడుతూ సమూహాలుగా తిరుగుతూ వైరస్ వ్యాప్తికి  కారణమవుతున్నారు. 

 

 

 ఈ క్రమంలోనే తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు సామాజిక దూరం పాటించి కరోనా నియంత్రణకు  తోడ్పాటు ఇవ్వాలి అంటు పిలుపునిస్తూన్న వేళ  తాజాగా  ఎంపీ పోస్ట్ చేసిన ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మామూలుగా అయితే చిన్న పిల్లలు కొనుక్కోవడానికి దుకాణానికి వెళ్లినప్పుడు గుంపులు గుంపులుగా వెళ్లి కొణుక్కుంటూ ఉంటారు .. కానీ ఈ ఫోటోలో పిల్లలు మాత్రం వారికి సూచించిన విధంగా సామాజిక దూరాన్ని పాటిస్తూ ఒక్కొక్కరుగా షాప్ లోకి వెళ్లి వారికి కావాల్సింది కొంటున్నారు. టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ పోస్ట్ చేసిన ఫోటో ప్రతి ఒక్కరికీ ప్రేరణ నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: