కరోనా వైరస్ తో పోరాడుతున్న ప్రపంచ దేశాలకు భారత్ ఆశాజనకంగా మారింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కి మందు లేకపోవడంతో చాలా మంది దేశాల ప్రభుత్వాలు  లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. మందులేని ఈ వైరస్ కి నియంత్రణ ఒకటే మార్గం కావటంతో ప్రపంచ దేశాల అధినేతలు తమ ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. అయితే అన్ని దేశాల కంటే కరోనా వైరస్ ను ఎదుర్కొనే విషయంలో భారత్ అద్భుతంగా పోరాటం చేస్తున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పుకొచ్చింది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా గల దేశం పైగా చైనా పక్కన ఉన్న దేశం అయినా గాని ఇండియాలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

 

అయితే దీనికి కారణం చూస్తే మలేరియా మందు హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ నీ భారత్ ప్రజలు బాగా వాడటంతో...కరోనా వైరస్ ప్రభావం ఇండియాలో అంతగా లేదని అంతర్జాతీయ వైద్య నిపుణులు అంటున్నారు. ఇదే టైమ్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ అనే డ్రగ్ కరోనా వైరస్ విషయంలో గేమ్ చేంజర్ అని తెలపడం జరిగింది. ఇప్పటికే ఈ మందు కోసం అనేక దేశాలు భారత వైపు ఆశగా చూస్తున్నాయి. ఇటువంటి టైములో తాజాగా భారత్ లో వాడే మరో మందు కూడా కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో బాగా పనిచేస్తున్నట్లు న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NYIT) నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

 

ఆ మందు మరేదో కాదు బీసీజీ వ్యాక్సిన్. ఈ మందు క్షయ వ్యాధి నుంచి రక్షిస్తుంది. ప్రతీ ఏటా భారతీయులు దీనిని తీసుకుంటారట. పుట్టిన పిల్లలకు ఇచ్చే బిసిజి( బాసిల్లస్ కాల్మెట్-గురిన్ వ్యాక్సిన్) ప్రాణాంతక కరోనావైరస్ మీద జరిగే యుద్దంలో గేమ్ ఛేంజర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు పేర్కొన్నారు. ప్రపంచమంతా పోరాడుతున్న కరోనా వైరస్ విషయంలో ఈ రెండు మందులు గేమ్ ఛేంజర్ కావటంతో… ప్రపంచానికి గొప్ప సహాయంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా...రెండు మందులను బీసీజీ వ్యాక్సిన్, హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కచ్చితంగా ఈ రెండు మందులు వల్ల ఆయా దేశాలలో కరోనా వైరస్ ఎఫెక్ట్ తగ్గితే మాత్రం ప్రపంచానికి చరిత్రలో నిలిచిపోయే సహాయం ఇండియా చేసినట్లవుతుందని చాలామంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: