భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ప్రెసిడెంట్ మంచి దోస్తులు. ఎంత దోస్తులంటే ఇద్దరూ హగ్గులు, చేతులూపుకోవడాలూ, ఒకటేంటి జన్మ జన్మల స్నేహం మాది అన్నట్లుగా ఉంటారు. మోడీ అమెరికా వెళ్తే హౌడీ మోడీ అనిపించారు ట్రంప్ . మరి ట్రంప్ భారత్ వస్తే గుజరాత్ తీసుకెళ్ళి మరీ  హోరెత్తించారు మన మోడీ.

 

ఇలా కలగలసిపోయిన ఈ మిత్రుత్వం మైకంలో కరోనా వైరస్ ఇండియాలో ప్రవేశించినా  కేంద్రం పట్టించుకోలేదని ఇపుడు పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. నిజానికి భారత్ లో కరోనా ఎంట్రీ ఇచ్చింది ఫిబ్రవరి 2న. అంటే మార్చి 22 వరకూ కేంద్రం మేలుకోలేదు. కచ్చితంగా యాభై రోజుల విలువైన కాలం ఈ మధ్యలో కరిగిపోయింది.

 

ట్రంప్ మన దేశ పర్యటనకు మురిపించుకుని మరీ వచ్చాడు. రిపబ్లిక్ డేకి పిలిస్తే ఫిబ్రవరికి టూర్ కంఫర్మ్ చేశాడు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్ వచ్చారు.  ఘన సన్మానం గౌరవం ఆ విధంగా దక్కించుకున్నాడు. నిజానికి ట్రంప్ టూర్ క్యాన్సిల్ కాకూడదన్న ఉద్దేశ్యంతోనే భారత్ కరోన వైరస్ విషయంలో కేంద్రం  కొంత అలసత్వం, ఆలస్యం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.

 

ఏదైతేనేం, ట్రంప్ వెళ్ళాకైనా భారత్ వేగిరపడలేదు. అన్నీ చూసుకుని తాపీగా మార్చి నెల మొదటి వారం నుంచి కరోనా విషయంలో ద్రుష్టి పెట్టింది. ఆ తరువాత రాష్ట్రాలను అప్రమత్తం చేసేసరికి ఇండియాకు బాగానే కరోనా విస్తరించింది. జనతా కర్ఫ్యూ వేళకు కేసులు పెరుగుతున్నాయి. 

 

ఈరోజు భారత దేశం వెలిగిపోవడంలేదు. చీకట్లో ఉంది. పగలే రాత్రిలా ఉంది. రోడ్డు మీద సందడి లేదు. ఇంట్లో ఉన్న వారిలో వెలుగు లేదు. రేపటి జీవితం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఆదాయం లేదు, ఖర్చులు తప్ప, తిండి తినడమే తప్ప పనులు లేవు.  

 


మొత్తానికి దీని వెనక ఉన్నది ట్రంప్ టూర్ అంటే ఆశ్చర్యమేమో కానీ అందులో నిజం లేకపోలేదన్న వారూ ఉన్నారు. అంటే ఓ విధంగా ట్రంప్ మన కొంప ముంచారనుకోవాలి. ఏప్రిల్ 30 వరకూ లాక్ డౌన్ అంటే నలభై రోజుల పాటు తలుపులేసుకుని దేశం పడుక్కుంటుందన్న మాట. అదే జరిగితే పేదలు, మధ్యతరగతి గతి అధోగతే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: