తెలంగాణ‌లో క‌రోనా కేసులు త‌గ్గ‌క‌పోవ‌డంతో సీఎం కేసీఆర్ ముందు నుంచి ఊహించిన‌ట్టుగానే ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు ప్ర‌క‌టించారు. ఇక ఏప్రిల్ 30వ తేదీ త‌ర్వాత ద‌శ‌ల వారీగా లాక్‌డౌన్‌ను స‌డ‌లిస్తామ‌ని కూడా కేసీఆర్ చెప్పారు. ఇక శ‌నివారం ఉద‌యం ప్ర‌ధాన‌మంత్రితో జ‌రిగిన ముఖ్య‌మంత్రుల వీడియో కాన్ఫ‌రెన్స్లో ఒక‌రిద్ద‌రు ముఖ్య‌మంత్రులు మిన‌హా అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా లాక్ డౌన్ పొడిగించాల‌ని ఏక‌గ్రీవంగా చెప్పార‌ని కేసీఆర్ చెప్పారు.

 

ఇక శ‌నివారం మ‌ధ్యాహ్నం ఏకంగా ఏడు గంట‌ల పాటు జ‌రిగిన సుదీర్ఘ‌మైన కేబినెట్ స‌మావేశంలో తాము తీసుకున్న లాక్‌డౌన్ పొడిగింపు తీర్మానాన్ని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి పంపుతున్న‌ట్టు కేసీఆర్ చెప్పారు. ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు రాష్ట్రంలో అన్ని లిఫ్ట్ ఇరిగేష‌న్ల ద్వారా పంట‌ల‌కు నీరు అందిస్తామ‌ని కేసీఆర్ చెప్పారు. ఇక మోదీకి పంపుతోన్న తీర్మానంలో లాక్ డౌన్ పొడిగింపు అంశంతో పాటు రైతుల‌కు మేలు జ‌రిగేలా న‌రేగాను వ్య‌వ‌సాయానికి అనుసంధానం చేయాల‌ని తాము మోదీకి పంపిన డిమాండ్ల‌లో కోరామ‌ని కేసీఆర్ చెప్పారు. 

 

అంటే రైతులు పొలం ప‌నుల‌కు అయ్యే కూలీ ఖ‌ర్చులో 50 శాతం భ‌రిస్తే.. మ‌రో 50 శాతం న‌రేగా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. నిజంగా ఇది అమ‌ల్లోకి వ‌స్తే దేశ‌వ్యాప్తంగా ఉన్న రైతు కూలీలు, రైతుల‌కు అదిరిపోయే బంప‌ర్ ఆఫ‌ర్ అవుతుంది. ఈ క‌రువు టైంలో ఇది మంచి ప్ర‌యోజ‌నం చేకూర్చిన‌ట్లువుతంది.

మరింత సమాచారం తెలుసుకోండి: