\అర‌టి రైతుల‌ను ఆదుకునేందుకు  ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఆఫ్‌ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చేసిన ప్ర‌య‌త్నాన్ని కేర‌ళ సీఎం విన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌శంసించారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో వ్యాపారాలు జ‌ర‌గ‌క ఇబ్బందుల్లో ఉన్న కేర‌ళ అర‌టి రైతాంగం నుంచి ఆకులు కొనుగోలు చేయాల‌ని, ఇక‌పై ఆకుల్లోనే భోజ‌నం చేయాల‌ని మ‌హీంద్ర సంస్థ‌ల క్యాంటీన్ల‌కు ఆనంద్ మ‌హేంద్ర ఆదేశాలు జారీ చేశార‌ట‌. అత్య‌వ‌స‌రంగా, కొన్ని ఆంక్ష‌ల‌తో న‌డుస్తున్న ఫ్యాక్ట‌రీలోని కొన్ని విభాగాల కార్మికులు ఇప్పుడు అర‌టి ఆకుల్లోనే భోజ‌నం చేస్తూ రైతుల‌కు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నారు. 

 

అయితే  ఇబ్బందుల్లో ఉన్న అరటి రైతులను తమ ఫ్యాక్టరీలు ఎలా ఆదుకుంటున్నాయో చెబుతూ ఆనంద్ మహీంద్రా ఇటీవల ట్వీటర్లో ఓ పోస్టు పెట్టారు. మిగ‌తా సంస్థ‌లు కూడా ఈవిధానం అనుస‌రించ‌డం వ‌ల్ల అర‌టి రైతులు ఎంతోకొంత ఆర్థికంగా లాభ‌ప‌డుతార‌ని పేర్కొన్నారు.  ఈ విష‌యాన్ని  విశ్రాంత జర్నలిస్టు పద్మ రామ్‌నాథ్ సీఎం విస‌రయి విజ‌య్ మెయిల్‌కు పెట్టారు. దీంతో స్పందించిన సీఎం ఆనంద్ మ‌హేంద్ర సేవ‌ల‌ను కొనియాడుతూ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. ‘‘ఇది స్వాగతించదగిన నిర్ణయం. మిగతా వాళ్లు కూడా దీన్ని అనుకరిస్తారని ఆశిస్తున్నామంటూ ఆనంద్ మహీంద్రా విధానాలు పర్యావరణానికి అనుకూలమైనవే కాకుండా రైతులకు మేలు చేసేలా ఉన్నాయి..’’ అని సీఎం కొనియాడారు. 


ఇదిలా ఉండ‌గా కేర‌ళ ప్ర‌భుత్వం చేప‌డుతున్న స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. సివిల్ స‌ప్లై వ్య‌వ‌స్థ  ఎంతో స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తోంది. లాక్ డౌన్ స‌మ‌యంలో అధికారుల బృందాలు ఎంతో ప‌క‌డ్బందీగా ఇళ్ల‌కు నేరుగా నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేస్తున్నాయి. ఒక చిన్న కుటుంబానికి దాదాపు నెల‌కు స‌రిపోయే విధంగా సామగ్రిని అంద‌జేస్తున్నారు. దీంతో లాక్‌డౌన్‌ను ప్ర‌జ‌లు స్వీయ నిర్బంధంలో స‌క్సెస్ చేస్తూ వ‌స్తున్నారు. కొన్ని అత్య‌వ‌స‌ర‌మైన అవ‌స‌రాలను తీర్చేందుకు ఏప్రిల్ 17 త‌ర్వాత అనుమ‌తులు ల‌భిస్తాయ‌ని తెలుస్తోంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: