తెలంగాణ‌లో క‌రోనా కేసులు క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో పెరుగుతూ వెళుతున్నాయి. శ‌నివారం ఉద‌యం మోడీతో వీడియో కాన్ఫ‌రెన్స్ తర్వాత ఏడు గంట‌ల పాటు సుదీర్ఘ‌మైన కేబినెట్ భేటీ నిర్వ‌హించిన అనంత‌రం కేసీఆర్ ప్రెస్‌మీట్లో ఈ నెల 30 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్టు చెప్పారు. అలాగే తెలంగాణ‌లో క‌రోనా లెక్క‌ల గురించి కూడా ఆయ‌న అంకెల‌తో స‌హా వివ‌రించారు. తెలంగాణలో పాజిటివ్ కేసులు 503కు చేరుకున్నట్లు సీఎం తెలిపారు. ఇందులో 14 మంది చనిపోయారని చెప్పారు. 96 మంది కోలుకున్నారని తెలిపారు. తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 393గా కేసీఆర్ ప్రకటించారు. 

 

క్వారంటైన్‌‌లో 1654 మంది ఉన్నారని చెప్పారు. తెలంగాణలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గిందని సీఎం తెలిపారు. ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌రంలో 123 కంటైన్‌మెంట్ జోన్ల‌ను గుర్తించిన ప్ర‌భుత్వం... గ్రేట‌ర్ పరిధి అవ‌త‌ల 150 కంటైన్‌మెంట్ జోన్ల‌ను గుర్తించిన‌ట్టు సీఎం తెలిపారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారు గానీ, క్వారంటైన్‌లో ఉన్న వారు గానీ, కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్నవారు గానీ ఏ ఒక్కరి పరిస్థితి విషమంగా లేదని, అది ఆ భగవంతుడి దయ అని సీఎం చెప్పారు. ఏప్రిల్ 24కు బాధితులంతా కోలుకునే అవకాశం ఉందని సీఎం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: