వారాల తరబడి లాక్‌డౌన్‌లో మగ్గుతున్న తెలంగాణకు శుభవార్త.. తెలంగాణలో కరోనా వైరస్ జోరు క్రమంగా తగ్గుతోంది. రోజురోజుకూ కరోనా విస్తరిస్తున్న వేగం తగ్గింది. ఇప్పటికే ఇతర దేశాల నుంచి వచ్చిన ముప్పై నాలుగు మంది డిశ్చార్జ్ అయ్యారు. వారి ద్వారా కరోనా సంక్రమించిన మరికొందరు కూడా డిశ్చార్జ్ అయ్యారు. 25779 మంది క్వారంటైన్ నుంచి కూడా వెళ్లిపోయారు.

 

 

తెలంగాణలో కొత్త కేసులు రావడం తగ్గింది. వ్యాధి ప్రబలకుండా కంటైన్ మెంట్ చర్యలకు ప్రజలు సహకరిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 503 ఉన్నాయి. 14 మంది చనిపోయారు. 96 మంది వ్యాధి నయమై ఇళ్లకు వెళ్లిపోయారు కూడా. ప్రస్తుతానికి తెలంగాణలో యాక్టివ్ కేసులు 393 మంది. నిజాముద్దీన్ ఘటన తర్వాత సుమారు 1200 మందిని పట్టుకుని టెస్టులు చేశారు. ఇలాంటి వారు క్వారంటైన్ లో 1654 మంది ఉన్నారు. 243 చోట్ల కంటైన్ మెంట్ ప్రాంతాలు ఉండగా, 223 గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నాయి.

 

 

అంతే కాదు.. ఇప్పుడు ఆస్పత్రులలో ఉన్నవారు ఎవరికి సీరియస్ గా లేదు. ఏప్రిల్ 24 వరకు ఒక బాచ్ క్లోజ్ అవుతుంది. ఇక దేశంలో చూసుకుంటే మహారాష్ట్రలో 11 మంది ఒక్క రోజులోనే చనిపోయారు. రాజస్తాన్ లో 15 మంది చనిపోయారు. మహారాష్ట్రతో తెలంగాణకు 500 కి.మీ. సరిహద్దు ఉండటం వల్లే కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది.

 

 

మొత్తం మీద తెలంగాణలో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతున్నాయి. ప్రజలు కాస్త మరో మూడు వారాలు సహకరిస్తే.. కరోనా పీడ చాలావరకూ విరగడ అయినట్టేఅంటున్నారు నిపుణులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: