కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే . అయితే కరోనా  వైరస్ ప్రబలుతున్న దృశ్య పాకిస్తాన్లో రోజురోజుకు విచిత్ర పరిస్థితులు చోటు చేసుకుంటుంది. లాక్ డౌన్  విధించక పోవడం...క్వారంటైన్ తూతూ మంత్రంగా ఉండటం లాంటి  కారణాలవల్ల పాకిస్తాన్ లో  రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. అంతే కాకుండా అక్కడి ప్రజలు వైద్య సిబ్బందిలో కూడా తిరుగుబాటు ఎదురవుతుంది. పాకిస్తాన్లో కరోనా  రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు అందరూ పర్సనల్ ప్రొటెక్షన్  లేకుండా వైద్య చేయలేము అంటూ ధర్నాకు దిగుతున్నారు.  కరోనా  వైరస్ పేషెంట్లకు చికిత్స అందించాలని..  మూడు పొరల ప్రొటెక్షన్ ఉండే సూట్  కావాలంటు  ధర్నాకు  దిగగా  వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఇదే సమయంలో వారికి సరైన వైద్యం అందించడం లేదని అటు  ప్రజలు కూడా డాక్టర్లు పై దాడికి దిగుతున్నారు. 

 


 పాకిస్తాన్ కానీ ఏ దేశం అయినా సరే డాక్టర్లను గౌరవించాలని లేకపోతే వినాశం తప్పదు అంటున్నారు విశ్లేషకులు. పాక్ లో  వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్నాయని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు కూడా చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. పాకిస్తాన్ దగ్గర కరోనా  వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు పరికరాలు సరిగా లేకపోవడం అంతేకాకుండా లాక్ డౌన్  అనేది కూడా తూతూ మంత్రంగా జరుగుతుండటం.. నిర్శక్ష్యం చేయడం కూడా ప్రస్తుతం కరోనా  వైరస్ కేసులు తగ్గిపోవడానికి కారణమవుతుంది. భవిష్యత్తులో కరోనా విజృంభించే  అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. 

 

 అటు మిత్ర దేశమైన చైనా కూడా ఎలాంటి సహాయం చేయడం లేదు. అటు  పాకిస్తాన్ సైన్యం కూడా పూర్తిగా తమ సౌకర్యాలను చూసుకుంటుంది. పాకిస్తాన్ సైన్యం  ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంది. తనకు కావాల్సిన అన్ని సదుపాయాలను తమవద్ద పెట్టుకుని మిగిలిన కొన్ని సదుపాయాలను ప్రజల కోసం ఇచ్చింది పాకిస్తాన్ సైన్యం. పాకిస్తాన్ సైన్యం మొత్తం లక్సరీ గా  బతకడానికి కావలసిన అన్ని సదుపాయాలను తమ దగ్గర పెట్టుకొని మిగితాది ప్రజలకు ఇచ్చినడి . అంటే సైన్యం  దేశం గురించి కాకుండా తన బతుకు గురించి ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే  పాక్ లో  రోజురోజుకూ తిరుగుబాటు ధోరణి ఎక్కువ అవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: