కరోనా వైరస్  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలుసిందే . చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలలో విజృంభిస్తు మరణమృదంగం మోగుతోంది. ప్రపంచ దేశాలలో విలయ తాండవం చేస్తూ ఎంతో మంది ప్రజలను మృత్యుఒడిలోకి లాగుతోంది. కంటికి కనిపించకుండా దాడి చేసి చంపెస్తుంది ఈ మహమ్మారి వైరస్. అయితే ఈ మహమ్మారి వైరస్ కు విరుగుడు లేకపోవడం ఈ వైరస్ నుంచి తప్పించుకోవాలంటే నివారణ ఒక్కటే మార్గం కావడంతో పాటు ఆయా దేశాల ప్రభుత్వాలతో పాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఎప్పటికప్పుడు ప్రపంచదేశాలకు సూచనలు సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే. 

 

 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సమస్యలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇక ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో ప్రపంచ అగ్రరాజ్యాల శాస్త్రవేత్తలు కూడా ఉంటారు. అయితే ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశం గురించి చేసిన ఓ ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ ప్రకటన ద్వారా భారత్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ చులకనగా చూస్తుంద అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ గురించి ఏం ప్రకటన చేసింది అంటారా... భారతదేశంలో కమ్యూనిటీ స్ప్రెడింగ్  జరిగిపోయింది అంటు  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. 

 


 ఇక తాజాగా భారత దేశం కూడా పాండమిక్ స్టేజ్ కి వచ్చేసింది  అంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రస్తుతం భారత్ లో  నెలకొన్న పరిస్థితులను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి తెలియజేయడంతో... మాట వెనక్కి తీసుకుంది ప్రపంచ ఆరోగ్య  సంస్థ. భారత్ ప్రస్తుతం పాండమిక్ స్టేజీలో లేదని లాక్ డౌన్ ద్వారా భారత్ కరోనా వైరస్ ను బాగానే కట్టడి చేసింది అంటూ  ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. భవిష్యత్తులో మాత్రం భారత్ కి  పెను ప్రమాదమే పొంచి ఉంది అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే దీనిపై విశ్లేషకులు మండి  పడుతూన్నారు తన తప్పును కవర్ చేసుకోవడానికి... చిన్నచూపు చూసే విధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసింది అంటు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: