ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ ను తొలగించి రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ను ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం చాలా చాకచక్యంగా రహస్యమైన ఆర్డినెన్స్ లు తయారుచేసి గోప్యంగా గవర్నర్ దగ్గరకు పంపించి అతని సంతకం అయిన తర్వాత జీవోలను బట్టబయలు చేసిన తీరు ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదమైన అంశంగా మారింది. కరోనా లాక్ డౌన్ విధించక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న నిర్ణయం జగన్ మరియు అతని పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది.

 

ఇప్పుడు జగన్ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆర్డినెన్స్ ప్రకారం ఎలక్షన్ కమిషనర్ పదవీకాలాన్ని ఐదు ఏళ్ళ నుండి మూడేళ్లకు కుదించారు. హఠాత్తుగా ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ ను పదవి నుండి తప్పించారు. దీనితో తీవ్రంగా నొచ్చుకున్న రమేష్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. హైకోర్టులో రమేష్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అందులో ఏపీ పంచాయతీ రాజ్ చట్టం చేసిన సవరణలు తన పదవీకాలం ముగిసిన తర్వాతే అమల్లోకి వస్తాయని రమేష్ పిటిషన్ లో పేర్కొన్నారు తెలుస్తోంది.

 

ఇకపోతే లాక్ డౌన్  వల్ల వల్ల హైకోర్టుకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే. అత్యవసర కేసులకు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుగుతుండగా.... రమేష్ పిటిషన్ పై విచారణ ఎప్పుడు జరుగుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక పోతే నిమ్మగడ్డ రమేష్ పై కక్ష సాధింపు చర్యగానే కొత్త ఆర్డినెన్స్ ను తీసుకువచ్చారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇలా తొలగించడం పూర్తిగా రాజ్యాంగవిరుద్ధమని చంద్రబాబు మండిపడ్డారు. పవన్ కూడా జగన్ బ్రభుత్వం చర్యను తీవ్రంగా వ్యతిరేకించగా ఇప్పుడు దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: