ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రోజు రోజు పెరిగిపోతున్న ఈ కరోనా వైరస్ బారిన ఇప్పటికే 17 లక్షలమందికిపైగా పడ్డారు.. అందులో లక్షమందికిపైగా ప్రాణాలు విడిచారు.. ఇంకా రోజు రోజుకు కరోనా మృత్యుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఈ మృత్యుల సంఖ్య తగ్గాలి అన్న.. కరోనా వైరస్ మాయం అవ్వాలి అన్న ఓ పని చెయ్యాలి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. 

 

ఆ ప్రచారం ఏంటి అంటే? ఏప్రిల్ 12 ఆదివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఇంటి మేడపైకి లేదా పెరటి లోకి వచ్చి మూడు నాక్షత్రాలు (గొర్రు కొయ్యలు) చూస్తే కరోనా వైరస్ మాయం అవుతుంది అని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ ప్రచారం లో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ ఈ ఫేక్ ప్రచారం మాత్రం అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. వాట్సాప్ లో అయితే ఒకరుకు నాలుగురు షేర్ చేస్తున్నారు. 

 

అయితే ఇటువంటి ప్రచారాలు ప్రస్తుతం కొత్త ఏమి కాదు.. మనం యాక్టీవ్ గా ఉండాలి కానీ రోజుకో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మోదీ కొరోనాను చాల జాగ్రత్తగా డీల్ చేసి అత్యంత తక్కువ కరోనా కేసులు ఉన్న దేశంగా మార్చారు. అయితే మోదీ ఇటీవలే రాత్రి 9 గంటలకు 9 నిముషాలు దీపం పెట్టాలి అని పిలుపునిచ్చారు. దేశ ప్రజలంతా దాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే అదే అదునుగా చూసుకున్న కొందరు బాల్కనీలోకి వచ్చి మోదికి సెల్యూట్ చెయ్యాలి అంటూ ప్రచారం చేశారు. అయితే ఆ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని మోదీ కూడా చెప్పారు.. ఇంకా ఇలాంటి ప్రచారాలు సోషల్ మీడియాలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మరి మూడు చుక్కల ప్రచారం ఏంటి అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: