ప్రపంచం ఇలా స్దంభించి పోతుందని ఎవరూ ఊహించి ఉండరు.. ఎందుకంటే ఈ శతాబ్ధపు అతిపెద్ద విపత్తు కరోనా వచ్చి.. ప్రపంచాన్ని కమ్మేసి జన జీవనాన్ని కష్టాల్లోకి నెట్టేసింది.. ఈ ప్రమాదం పేదల జీవితాల్లో పూర్తిగా చీకట్లను నింపేసింది.. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ నేపధ్యంలో ఆన్ని చోట్ల లాక్‌డౌన్ అమలవుతున్న నేపధ్యంలో, ఎక్కడి వారు అక్కడే చిక్కుకు పోయారు.. సొంత ఊర్లకు వెళ్లలేక, ఉన్నచోట తిండి లేక కష్టాలు పడుతున్నారు.. మరికొందరు కాలినడకన ప్రయాణాలు సాగిస్తుండగా, రహస్యంగా వెళ్లేవారు కొందరున్నారు.. ఏది ఏమైనా సొంత ఊరుకు వెళ్లితే కనీసం గూడు, గుడ్ద, గూటికి లోటుండదని భావించిన వారు ఎంత దూరమైన ఎలాగోలా వెళ్లడానికే నిశ్చయించుకుంటున్నారు.. ఇలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువకుడు ఒకరు..

 

 

ఒడిశాకు చెందిన ఈ యువకుడు మహారాష్ట్ర నుంచి సొంత రాష్ట్రానికి సైకిల్ మీద ప్రయాణించాడు. రూట్ తెలియనప్పటికీ, అంత దూరం సైకిల్ మీద వెళ్లలేవని తోటి వారు వారిస్తున్నప్పటికీ.. ఇంటికెళ్లాలనే తపనతో.. వారం రోజుల్లో నాలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణం సాగించి సొంతూరు చేరుకున్నాడు.. ఇతని పేరు మహేశ్ జెనా(20) సొంతూరు ఒడిశాలోని జైపూర్ జిల్లా. ఈ యువకుడు గత కొన్ని నెలల క్రితం మహారాష్ట్రలోని సంగ్లీ మిరాజ్‌ కు ఉపాధి నిమిత్తం వెళ్లాడు..

 

 

కానీ కరోనా వైరస్ వచ్చి ఇలాంటి ఎందరో వలస జీవుల పొట్ట కొట్టిన నేపధ్యంలో పనులు లేక సొంతూరు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ వెళ్లుదామంటే రవాణా సౌకర్యాలు స్దంభించిపోయాయి కదా.. అందుకే సైకిల్ పై వెళ్లాలని నిర్ణయించుకుని రూ.1200 పెట్టి మార్చి 31న ఒక సెకండ్ హ్యండ్ సైకిల్ కొనుక్కోని, ఏప్రిల్ 1న ఉదయం 4.30 గంటలకు అతని ప్రయాణం మొదలుపెట్టాడు. అలా రోజుకు 200 కి.మీ.పైగా ప్రయాణం చేస్తూ.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ మీదుగా ప్రయాణించి ఏడు రోజుల్లోనే సొంతూరు చేరుకున్నాడు...

 

 

ఈ ప్రయాణంలో తన అనుభవాన్ని పంచుకుంటూ.. రోజూ  అర్ధరాత్రి 12 గంటల వరకు సైకిల్ తొక్కేవాడినని.. రోడ్డు పక్కన ఉన్న దాబాలు, పోలీసులు, వాలంటీర్ల దగ్గర పొట్టనింపుకుంటూ  అలసటగా అనిపించిన రాత్రి సమయాల్లో గుళ్లు, దాబాల్లో నిద్రించేవాడినని చెప్పాడు.. ఏది ఏమైనా సంకల్పం ముందు పెద్ద గమ్యమైన చిన్నదిగానే కనిపిస్తుందని ఈ యువకుడు నిరూపించాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: