క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అంద‌రూ చెపుతున్నారు. క‌రోనా ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సోకకుండా సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని... మాస్క్‌లు ధరించాల‌ని.. లాక్ డౌన్ స్ట్రిక్ట్‌గా అమలు చేయాల‌ని చెపుతున్నారు. ఇక ఎవ‌రైనా విదేశాల నుంచి వ‌స్తే వారు త‌ప్ప‌కుండా క్వారంటైన్‌లో ఉండాల‌న్న నిబంధ‌న‌లు కూడా  ఉన్నాయి. అంతెందుకు తెలంగాణ నుంచి ఏపీలోకి వ‌స్తోన్న వారినే ఏకంగా రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉంచుతోన్న ప‌రిస్థితి. అయితే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ ఐఏఎస్ అధికారి త‌న కుమారుడు విదేశాల నుంచి వ‌చ్చిన విష‌యం దాచింది.

 

అలా త‌న కుమారుడి వ‌ల్ల క‌రోనా ఆమెకు సోకింది. ఆమె నుంచి ఆమె స‌మీక్ష చేసిన ఇత‌ర అధికారుల‌కు సైతం క‌రోనా సోకింది. ముందుగా ఆమె కుమారుడికి, ఆ త‌ర్వాత ఆమెకు క‌రోనా ఉన్న‌ట్టు నిర్దార‌ణ అయ్యింది. త‌ర్వాత ఆమె క‌లిసి తిరిగిన అధికారుల‌కు క‌రోనా టెస్టులు చేయ‌గా వారికి కూడా క‌రోనా ఉన్న‌ట్టు నిర్దార‌ణ అయ్యింది. ఆమె చేసిన త‌ప్పుకు మ‌రో 36 మంది అధికారులు కూడా బ‌ల‌య్యారు. ఆమె హాస్ప‌ట‌ల్‌కు రాన‌ని మొండికేయ‌డంతో ఇప్పుడు డాక్ట‌ర్లు కూడా ఆమె ఇంటికే వ‌చ్చి వైద్యం చేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: