కరోనాతో ఇంట్లో ఉండిపోయిన మధ్య, పేదతరగతి వారి బాధలు అన్నీ ఇన్నీ కావు.. సమయానికి సహాయం అందలేక.. మాటలతోనే పొద్దుగడిపేస్తున్న నాయకుల చేష్టలను ప్రశ్నించలేక వారి తలరాతలను వారే నిందించుకుంటు.. గడుస్తున్న రోజులను భారంగా వెళ్లదీస్తున్నారు.. ఇలాంటి సమయంలో అనుకోని ఆపద ఏదైనా వస్తే పేదల కష్టాలు చెప్పుకోవడానికి ఒకరి మీద ఒకరికి నమ్మకం కూడా లేకుండా చేసింది ఈ కరోనా వైరస్.. కానీ టిక్‌టాక్ మాత్రం మరచిపోలేని సహాయం చేసింది..

 

 

ఇకపోతే ఇన్నాళ్లూ ఈ టిక్‌టాక్ వల్ల ఊపయోగమే లేదని, ఇదెక్కడి మాయదారి టిక్‌టాక్ అని నెటిజన్ దుమ్మెత్తిపోసారు.. ఎందుకంటే ఈ టిక్‌టాక్ వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాదు, అంగవైకల్యాలు కూడా తెచ్చుకున్న వారు ఉన్నారు.. కానీ ఇన్నాళ్లకు అదీ కరోనా కాలంలో ఈ టిక్‌టాక్ ఒక మంచిపని చేసింది.. తాను సహాయం చేయలేకపోయినా, కష్టాల్లో ఉన్న ఓ కుటుంబానికి, సహాయం అందేలా చేసింది.. ఆ వివరాలు తెలుసుకుంటే.. బెళగావి జిల్లాలోని రాయదుర్గ తాలూకాలోని నరసాపుర గ్రామానికి చెందిన శేఖవ్వ అనే మహిళకు రెండి కిడ్నీలు దెబ్బతినడంతో ఆమె భర్త ఒక కిడ్నీ దానం చేయగా, ఆ కిడ్నీని శేఖవ్వకు అమర్చారు వైద్యులు. కాగా ఆపరేషన్‌ జనవరిలో చేయగా.. అప్పటి నుండి ఇంట్లోనే ఆ మహిళ మందులు వాడుతూ విశ్రాంతి తీసుకుంటోంది.

 

 

ఈ క్రమంలో ఆమెకు కావలసిన మందులు అయిపోవడంతో, లాక్‌డౌన్‌ వల్ల 20 రోజుల నుంచి ఆమెకు కావాలసిన మందులు తీసుకునే వీలు లేకపోవడం వల్ల ఆపేసింది.. అయితే ఆ మందులు వాడటం ఆపేసిన తర్వాత క్రమ క్రమంగా ఆమె ఆరోగ్యం రోజురోజుకూ నీరసించడం మొదలు పెట్టింది.. ఈ సమయంలో ఏం చేయాలో పాలుపోని ఆమె కూతురు పవిత్ర తన తల్లి బాధను వివరిస్తూ ఒక టిక్‌టాక్‌ వీడియో చేసింది.

 

 

దీంతో ఆ వీడియో సీఎం యడ్యూరప్ప దృష్టికి వెల్లగా అతని సూచన మేరకు జిల్లా అధికారులు శనివారం ఆమె ఇంటికి వెళ్లి నెల రోజులకు సరిపడా మందులను అందజేశారు. ఏదైనా సమస్య ఉంటే తెలియజేయాలని సూచించారు.. చూసారా టిక్‌టాక్‌ను ఇలా మంచికి ఉపయోగించుకోవాలి కానీ అడ్దమైన వీడియోలతో కాళ్లూ, చేతులు విరగగొట్టుకోవడానికి కాదు.. అంటూ ఆ అమ్మాయి చేసిన పనిని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: