భారత దేశంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్  కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజలందరినీ ఇంటికే పరిమితం చేస్తూ జన సమూహాలు ఉండే అన్ని ప్రాంతాలనూ మూసివేస్తూ  ప్రజారవాణా వ్యవస్థను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం . ఈ నేపథ్యంలో ఉద్యోగులు వ్యాపారులు అన్ని వర్గాల ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో చాలామంది లాక్ డౌన్ లో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా సగటు మనిషి పై రోజురోజుకు ఆర్థిక భారం పడుతుంది. అయితే  లాక్ డౌన్  నేపథ్యంలో భారత ప్రజలు ఎవరిపై  ఆర్థిక భారం పడే ఇబ్బంది పడకుండా ఉండేందుకు... భారత బ్యాంక్ లకి పెద్దన్న  లాంటి రిజర్వ్ బ్యాంక్... మూడు నెలల పాటు మారటోరియం విధించిన విషయం తెలిసిందే. 

 

 

 భారత ప్రజలు ఎవరు మూడు నెలల పాటు ఈఎమ్ఐ లు  కట్టాల్సిన అవసరం లేదని దీనికి ఆయా బ్యాంకులు కూడా అంగీకరించాలి అంటూ సూచించింది. లాక్ డౌన్  నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో కాస్త ఉపశమనం లభించింది అని ప్రజలు అనుకుంటున్న తరుణంలో.. ప్రజలకు భారీ షాక్ తగిలింది. రిజర్వ్  బ్యాంకు ఆదేశాలను జాతీయ బ్యాంకులు సహా ప్రైవేటు బ్యాంకులు ఆర్థిక సంస్థలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈఎమ్ఐ లు మూడు  వాయిదాలు కట్టాల్సిన అవసరం లేదంటూ  రిజర్వు బ్యాంక్ స్పష్టం చేసిన నేపథ్యంలో... ఖాతాదారుడు మకు  మారటోరియం అవసరం లేదు అని రాసిస్తే  తప్ప అకౌంట్లో డబ్బులు కట్ చెయ్యవద్దు అని అన్ని బ్యాంకులకు సూచించింది. 

 

 

 కానీ ఒక్క బ్యాంకు కూడా దీన్ని అమలు చేయలేదు. ప్రైవేటు బ్యాంకులే  కాదు జాతీయ బ్యాంకులు సైతం రిజర్వు బ్యాంకు ఆదేశాలను బేఖాతరు చేశారు. దీంతో ఖాతాదారులు అందరూ లబోదిబోమంటున్నారు.  bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు నెలలపాటు వాయిదాలు కట్టుకున్న పర్లేదు అంటూ మారటోరియం విధించిందని  ఈఎమ్ఐ ల  కోసం ఉంచిన మొత్తం సొమ్మును అవసరాలకు వాడుకున్నారు. కానీ ప్రస్తుతం బ్యాంకులు ఈఎంఐ కట్టనందుకు ప్రజలకు జరిమానా విధిస్తున్నట్లు... జరిమానా చెల్లించాలంటూ మెసేజ్లు వస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఇదేంటని  బ్యాంకులకు ఫోన్ చేస్తే కస్టమర్ కేర్ సంప్రదించాలని సూచిస్తున్నారు... కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే సరైన సమాధానం చెప్పడం లేదు అంటూ ప్రజలు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: