సౌత్ ముంబై లోని తాజ్ మహల్ ప్యాలస్ హోటల్ లో పనిచేసే సిబ్బంది లో 6 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతానికి వారిని బొంబాయ్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇప్పటివరకైతే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బొంబాయ్ హాస్పిటల్ కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ బన్సాలి వెల్లడించారు. ఆరుగురితో బాగా కాంటాక్ట్ లో ఉన్నవారిని గుర్తించి క్వారంటైన్ కేంద్రానికి తరలించామని సీనియర్ మున్సిపల్ ఆఫీసర్ చెప్పుకొచ్చాడు.

 

తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో అత్యవసర సేవలను అందిస్తున్న వైద్య సిబ్బంది ఆశ్రమం పొందుతున్నారు. ప్యాలెస్ మొత్తం శుభ్రపరిచే సిబ్బందిని కూడా క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు అధికారులు. హోటల్ లో ఉన్న చాలామందికి కోవిడ్ 19 వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయని అధికారులు మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.


గతవారం నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలిగా... 2 రోజుల క్రితం ఇద్దరికి కరోనా వైరస్ సోకిన లక్షణాలు బయట పడగా... వారిని హాస్పిటల్ కి తరలించారు. అయితే తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ సంస్థ యాజమాన్యం మాట్లాడుతూ తమ సిబ్బంది లోని ఐదు వందల మందికి కరోనా టెస్టులు చేయగా చాలామందికి కరోనా నెగటివ్ అని నిర్ధారణ అయినట్టు వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చాలా తక్కువ మంది తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో బస చేస్తున్నారు. ఒకవేళ ఎప్పటిలాగా ఎక్కువమంది అతిథులు ఉన్నట్లైతే... వారు కూడా కరోనా వైరస్ బారిన పడే వారని హోటల్ సిబ్బంది తెలిపింది.


ఇకపోతే మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1, 761 కరోనా కేసులు నమోదు కాగా... కరోనా బారిన పడిన 126 మంది ప్రాణాలను కోల్పోయారు. కేవలం ముంబై నగరంలోనే 1, 146 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: