అదేంటో ఈ తరం అన్నీ చూసేస్తోంది. కలలో సైతం ఊహించలేనివి కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. చేయిస్తున్నాయి కూడా. నిజానికి లాక్ డౌన్ అన్న పదం ఇప్పటిదాకా  ఎవరికైనా తెలుసా. ఈ తరానికే అది ప్రత్యేకం. ఎంతటి పాతకాలంలో అయినా ఇలా పనీ పాటా లేకుండా ఇంటిపట్టున మనిషి ఉండి ఎరగ‌డు.

 

సరే ఇంట్లో ఉంటే నయం, బయట ఉన్నది కరోన దెయ్యం అంటున్నారు కాబట్టి తప్పదనుకోవాలి. ఇవన్నీ ఇలా ఉంటే కరోనా వైరస్ విస్తరణ నేపధ్యంలో లాక్ డౌన్ని అనివార్యంగా ఈ నెలాఖరువరకూ పొడిగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తరువాత చూసుకుంటే భారత దేశం తీవ్ర  కడగండ్లలో పడిపోతుంది. అపుడు చేయాల్సింది ఇంతకు ఇంతా ఒకే లెక్కన పనే  పనిట.

 

ఇపుడు తాపీగా కాళ్ళు బార జాపి కూర్చున్న వారంతా అపుడు రోజుకు పన్నెండు గంటలు పని చేయాలట. అలా కార్మిక చట్టాల్లో భారీ సవరణలు తీసుకువచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోందని అంటున్నారు. 1948 నాటి  భారత చట్టాన్ని తెచ్చి మరీ  కర్మాగారాల్లో పెద్ద ఎత్తున  ఆగిపోయిన ఉత్పత్తులను  ఎక్కువ చేసి దేశాన్ని అభివ్రుధ్ధి దిశగా  మళ్ళీ సాధారణ స్థితికి తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోందిట.

 

ఇక 1948 కార్మిక చట్టంలో 12 గంటలు పనిచేయాలన్న నిబంధన ఉందిట. దాన్ని అమలు  చేయాలనుకుంటోందిట. ఇపుడున్న దాని ప్రకారం రోజులు ఎనిమిది గంటలు, వారానికి 48 గంటలు మాత్రమే పని ఉంటుంది. అయితే ఆ చట్టం అమలు చేస్తే వారానికి 72 గంటలు పని చేయాల్సి ఉంటుంది. 

 

ఇలా అదనంగా పనిచేసే వారికి అదనపు వేతనం కూడా  ఉంటుందిట. మొత్తానికి లాక్ డౌన్ తరువాత క్షణం విశ్రాంతి ఉండదన్న మాట. మళ్ళీ బిజీ లైఫ్ లోకి  ప్రతీవారూ వెళ్ళిపోవడమే. ఇక నయా లైఫ్ చూసుకోవాలిగా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: