జీవితంలో ఎదో సాధించాలని అందరం పరిగెడుత్తాం. ఎంత పరిగెత్తిన ఎదో ఒక్కరు రోజు ఆగిపోవాల్సిందే. ఇతను ఒక్క రిటైర్డ్ అధికారి. తన చుట్టూ అన్ని ఉన్నాయి. కానీ అతనికి ఎదో వెల్తి. విశ్రాంతి సమయంలో భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలనుకున్న ఆయనకు ఎదో వెల్తి. పిల్ల భవిష్యత్తు బాగుండాలని ఉన్నత చదువులు చదివించాడు. అతను అనుకున్నట్టే పిల్లలు విదేశాలలో స్థిరపడ్డారు.

 

చనిపోయిన తల్లిదండ్రులకు కొడుకులు తలకొరివి పెడితే వారికి పున్నామి నరకం నుంచి విముక్తి లభిస్తుందని నానుడి. కానీ నేటి సమాజంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకునే నాధుడే కరువైయ్యారు. పిల్లల కోసం తమ జీవితాలను ఫణంగా పెట్టిన కన్నవారిని కాదనుకుంటున్నారు. పండుగకో.. పబ్బానికో రాలేని పరిస్థితి. 

 

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ లాంటి జబ్బులు దాడి చేస్తే.. పిల్లలెలా ఉన్నారో.? తమను ఎవరు చూసుకుంటారన్న బెంగ.. ఇలాంటి సమయంలో పిల్లలు పక్కన లేరనే భాధ ఆయన్ని తొలిచేసింది. చివరికి అదే ఆవేదన ఆయనను మింగేసింది. మహమ్మారి కరోనా లాంటి జబ్బులు దాడి చేస్తే.. పిల్లలెలా ఉన్నారో.? తమను ఎవరు చూసుకుంటారోనన్న బెంగ.. ఇలాంటి సమయంలో పిల్లలు పక్కన లేరనే భాధ ఆయన్ని తొలిచేసింది. చివరికి అదే ఆవేదన ఆయనను మింగేసింది.కంటతడి పెట్టిస్తున్న ఈ విషాద ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళ్తే.. ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉద్యోగ రీత్యా వేరు వేరు ప్రాంతాలల్లో స్థిరపడ్డారు. గత కొద్దిరోజులుగా పిల్లలతో గడపలేకపోతున్నా అనే మనస్తాపానికి గురైయ్యాడు.భార్య అప్పల కొండమ్మ సమీపంలోని వేరే ఇంటికి వెళ్లిన సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

 

ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకుని చనిపోయాడు. ఇంటికి తిరిగొచ్చిన భార్య ఫ్యాన్‌కి వేలాడుతున్న భర్త శవాన్ని చూసి షాక్‌కు గురైంది. స్థానికులకు సమాచారం అందించడంతో కిందకు దించారు. ఆయన అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: