ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు  అన్ని ఆఫీసులో కూడా మూతపడటంతో .. అందరూ ఆర్థిక ఇబ్బందులో  కూరుకుపోతున్నారు. ముఖ్యంగా నగరాల్లో ఉండే ప్రజల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారిపోతున్నాయి. ఎందుకంటే నగరాల్లో నివసించే వారు ప్రతి వస్తువును కొనాల్సి ఉంటుంది. దానికి తోడు ఇంటి అద్దె కట్టడం కూడా జరుగుతుంది. ఉద్యోగం చేసినా చేయకపోయినా... ప్రతి నెల టైం కి అద్దె మాత్రం  చెల్లించాల్సిందే. లేకపోతే ఓనర్ మాత్రం ఊరుకోడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో అద్దె ఇంట్లో ఉన్న చాలామందికి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అద్దె కట్టాలంటే  చాలా ఇబ్బందిగా మారుతుంది. 

 

 

 మామూలుగా అయితే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అద్దె  మాత్రం చెల్లించాల్సిందే అంటూ ఉంటారు ఇంటి యజమానులు. చాలా మటుకు అద్దె చెల్లించాల్సిందే అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న ఇంటి ఓనర్ మాత్రం తమ ఇంట్లో ఉంటున్న వారిని అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు అంటూ అద్దెను  మాఫీ చేసాడు. కష్ట కాలంలో తన ఇంట్లో అద్దెకుంటున్న వారి బాధలను అర్థం చేసుకుని అద్దెను  మాఫీ చేసి పెద్దమనుసును  చాటుకున్నాడు. అయితే అద్దె ను  మాఫీ చేయడంలో  అంత గొప్ప ఏముంది అనుకుంటున్నారా... ఐదు పది వేలు అయితే ఎ mలాంటి ఇబ్బంది ఉండదు కానీ 3.4 లక్షలు అయితే గొప్పే  కదా. 

 

 బాల లింగం  అనే వ్యక్తికి నగరంలో మొత్తం 75 సింగల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉన్నాయి. ఆ ఇళ్లలో  బీహార్ నుంచి వలస వచ్చిన కార్మికులు అద్దెకు ఉంటున్నారు. అయితే బాల లింగానికి చెందిన ఇల్లు అద్దెకు ఉంటున్న అందరిని ఏప్రిల్ కి సంబంధించిన అద్దె  కట్టాల్సిన అవసరం లేదు అంటూ చెప్పేసాడు. ఈ సందర్భంగా మాట్లాడిన బాల లింగం... ప్రస్తుతం లాక్ డౌన్  కారణంగా మహిళలు అద్దెకి  ఉంటున్న వారు  పనులకు వెళ్లడం లేదని... ఈ నేపథ్యంలో ఎలాంటి ఆదాయం లేక తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారని ఇటువంటి సమయంలో అద్దె  అడిగి ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదు అంటూ చెప్పాడు. కష్టాలు కన్నీళ్లు దిగమింగుకొని ఈ స్థాయికి వచ్చానుని...  అందుకే అందరి బాధలు అర్థం చేసుకుంటూన్నాను అన్నారు  బాల లింగం. గతంలో కూడా ఇలాంటి దాతృత్వ చర్యలు బాగానే చేపట్టాడు బాల లింగం.

మరింత సమాచారం తెలుసుకోండి: