ప్రపంచాన్ని కరోనా కమ్మేసిన ఆపత్కాలంలో భారత్‌ అన్ని దేశాలకు ఔషధ ప్రదాయినిగా మారింది. మలేరియా చికిత్సలో ఎంతో కాలంగా భారత్‌ ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనాపై సమర్థవంతంగా పనిచేయడమే ఇందుకు కారణం...! అగ్ర దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కరోనా చికిత్స మందుల కోసం ఇప్పుడు భారత్‌ వైపు ఆశగా చూస్తున్నాయి. డ్రగ్స్ తయారీలోనే దేశంలో సెకండ్ క్యాపిటల్‌గా ఉన్న హైదరాబాద్‌లో హైడ్రాక్సీ క్లోరో క్వీన్‌ లభ్యతేంటి..?

 

భారత్‌లో కరోనా వేగంగా విస్తోరిస్తోంది. రోజు రోజుకి కేసులు పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. అయితే కరోనాను ట్రీట్మెంట్ చేయడానికి వ్యాక్సిన్ లేదు. ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు చేస్తున్నాయ్‌.  ప్రస్తుతం కరోనాను కట్టడి చేసేందుకు ఆంటీ వైరల్ డ్రగ్స్ వాడుతున్నారు. ఈ డ్రగ్స్‌లో ఎక్కువగా ఫలితాలిస్తుంది హైడ్రాక్సీ క్లోరో క్వీన్. ఈ విషయాన్ని ఇప్పటికే భారత వైద్య పరిశోధన మండలి సైతం స్పష్టం చేసింది.

 

ఔషధాల తయారీలో దేశంలోనే హైదరాబాద్ ముందుంది. దీంతో  అందరి కన్ను భాగ్యనగరంపై పడింది. మరోవైపు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సైతం హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ను పెద్ద ఎత్తున తయారు చేయాలని కంపెనీలను కోరింది. 

 

వాస్తవానికి గతంలో హైడ్రాక్సీ క్లోరో క్వీన్‌కు డిమాండ్ చాలా తక్కువ. కరోనా కట్టడిలో ప్రపంచ వ్యాప్తంగా ఈ మందులను వాడుతుండటంతో వీటికి డిమాండ్ పెరిగింది. అయితే హైదరాబాద్‌లో హైడ్రాక్సీ క్లోరో క్వీన్ బల్క్ డ్రగ్స్ సరిపడా  లేవు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి బల్క్ డ్రగ్స్ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మందులు దాదాపు 50 రోజుల వరకు సరిపోతాయి. ఈ లోపు హైడ్రాక్సీ క్లోరో క్వీన్ మందుల తయారీ మొదలు కానుంది.

 

మరోవైపు హైడ్రాక్సీ క్లోరో క్వీన్ అమ్మకాలపై షరతులు విధించారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు ఇవ్వద్దని మెడికల్ షాపులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: