ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ మద్యం దుకాణాలన్నీ మూసివేయబడ్డాయి. దాంతో ఎక్కడా కూడా మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు ఎక్కువ డబ్బులు వెచ్చించి మరీ తమకిష్టమైన ఆల్కహాల్ బ్రాండ్లను బ్లాక్ లో కొనుగోలు చేస్తున్నారు. పోలీసుల కళ్ళుగప్పి ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ ఛానల్ న్యూస్ రిపోర్టర్ గా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి తన కారు డిక్కీలో మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.


పూర్తి వివరాలు తెలుసుకుంటే... బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్ట్ మీదుగా ప్రయాణిస్తున్న TS 08 GN 2525 నెంబరు కల హ్యుందాయ్ వెర్నా కారును పోలీసులు ఆపు చేసి డిక్కీ లో ఏముందో చూపాలని కోరారు. కానీ ఆ కారు నడుపుతున్న వ్యక్తి మాత్రం దయచేసి వదిలేయండి సార్ అంటూ బతిమాలాడు. కానీ పోలీసులు అతన్ని పక్కకు నెట్టి కారు డిక్కీ తెరిచి చూడగా... అందులో బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ డాగ్, సిగ్నేచర్ వంటి మద్యం బ్రాండు బాటిల్స్ లను కలిగి ఉన్న ఐదారు పెట్టెలు దర్శనం అయ్యాయి. దాంతో తన అక్రమ రవాణా బయటపడిందని తీవ్ర ఆవేదనకు గురైన సదరు వ్యక్తి తాను ఒక ఛానల్ రిపోర్టర్ అని తనని వదిలేయమని, ఈ విషయాన్ని లైట్ తీసుకోమని పోలీసులను ప్రాధేయపడ్డాడు. కానీ పోలీసులు తమ విధులను నిజాయితీగా నిర్వహిస్తూ... కారులోని మందు పెట్టిన ఫోటోలు వీడియోలు తీసి కారు తో పాటు మద్యం బ్రాండ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులను నమోదు చేసామని మీడియాతో చెప్పుకొచ్చారు.


ఇకపోతే దేశవ్యాప్తంగా మద్యంకు బాగా అలవాటు పడిన ప్రజలు మందు దొరక్క పిచ్చోళ్ళు అయిపోతున్నారు. కొంతమంది ఏకంగా తాగకూడని విషపు లోషన్స్ లని తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఏది ఏమైనా వారి బాధ మాటల్లో వర్ణించలేనిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: