ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యాలకు సైతం వెన్నులో వణుకు పుట్టిస్తోంది.. అందరిలో ప్రాణ భయం కలిగిస్తూ బెంబేలెత్తిస్తోంది . చైనాలో వెలుగులోకి  వచ్చిన ఈ మహమ్మారి వైరస్ బారినపడి ఇప్పటికే వేల మంది  ప్రజల ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ కు  సరైన విరుగుడు  కూడా లేకపోవడం నివారణ ఒక్కటే మార్గం కావడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిపోయింది. రోజు రోజుకు మహమ్మారి వైరస్ భారిన  పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇక ఈ వైరస్ బారిన పడి అటు భారతదేశం కూడా అల్లాడుతున్న విషయం తెలిసిందే. భారతదేశంలో కూడా ఇప్పటికే ఈ మహమ్మారి వైరస్ బారిన పడిన వారి సంఖ్య 6 వేలకు పైగా చేరుకుంది. 

 

 

 దీంతో భారత ప్రజలు కూడా ప్రాణభయంతో బతుకుతున్నారు. ఇప్పటికే అగ్రరాజ్యాలను  ప్రాణభయంతో వనికిస్తున్న ఈ మహమ్మారి వైరస్ సింగపూర్ లో కూడా క్రమక్రమంగా విస్తరిస్తోంది. ఒకేరోజు 191 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే సింగపూర్ లో కొత్తగా వైరస్ సోకిన వారిలో  51 మంది భారతీయులే ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కరోనా  వైరస్ బారినపడి 90 ఏళ్ల భారతీయ వృద్ధుడు మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 

 

 

 కాగా  ఈ యాభై ఒక్క మంది భారతీయులతో కలిపి సింగపూర్లో మొత్తంగా కరోనా వైరస్ బారిన పడ్డ భారతీయుల సంఖ్య మూడు వందలకు చేరింది. ఇప్పుడు వరకు సింగపూర్లో 2299 కరోనా వైరస్  కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. ఇక ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం కూడా ఎన్నో కఠిన నిబంధనలు అమలులోకి తెస్తోంది. ఓవైపు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు కరోనా పై  పోరాటానికి సిద్ధం అవుతోంది సింగపూర్ ప్రభుత్వం. కాగా భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ మహమ్మారి వైరస్ బారినపడి భారతీయులు మృత్యువుతో పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: