ఈ ఆదివారం ఉదయం ఆంధ్రజ్యోతిలో ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకులో అనేక ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించారు. అసలు కేసీఆర్ తెలంగాణలో నయా నిజాంగా మారిపోయాడని.. ఒంటెత్తు పోకడలు పోతున్నారని.. కేసీఆర్‌ ను ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని పాపం.. చాలా బాధపడిపోయాడు. అంతేనా.. ఇంకా చాలా చాలా రాశాడు కేసీఆర్ సర్కారు చేస్తున్న నిర్వాకాల గురించి.

 

 

అంత వరకూ బాగానే ఉంది. కానీ.. ఓ విషయం గురించి ఆర్కే ప్రస్తావించిన తీరు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి. ఇటీవల కేసీఆర్ కరోనా కారణంగా సర్కారు ఆదాయం పడిపోయిందన్న కారణంతో ఉద్యోగుల జీతాల్లో కోత వేశారు. దీనిపై ఆర్కే తన కొత్త పలుకులో స్పందించారు.. అదేంటో మీరే చూడండి.. ఇంతకీ ఆర్కే ఏం రాశాడంటే.. “

ఉద్యోగ సంఘాలతో కనీసం మాట మాత్రమైనా సంప్రదించకుండా జీతాల్లో కోత విధించినా నోరెత్తలేని స్థితిలో ఆయా సంఘాలు ఉన్నాయి. తెలంగాణలో ఇవ్వాళ ఎవరైనా మనుగడ సాగించాలంటే ఆధునిక నిజాం ప్రభువుకు గులాంగిరి చేయాల్సిందే!”

 

 

మరి జీతాల్లో కోత విషయంలో కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో మాట్లాడారో మాట్లాడలేదో తర్వాత చూద్దాం.. కానీ ఇదే విషయం రాసుకొచ్చిన ఆర్కే తన మీడియా సంస్థల్లో ఉద్యోగులను కరోనా సాకు చెప్పి ఏకంగా ఉద్యోగాల నుంచే పీకేయిస్తున్నాడని ఉద్యోగులు లబోదిబోమంటున్నారని వార్తలు వస్తున్నాయి. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతే వేస్తే.. తర్వాత ఎలాగూ ఇస్తారు. మరి పీకేయబడిన ఆంధ్రజ్యోతి ఉద్యోగు సంగతి ఏంటి..?

 

కరోనా కారణంతో ఆంధ్రజ్యోతిలో జిల్లా స్థాయి ఉద్యోగుల్లో 50 శాతం మందిని ఇంటికి పంపిస్తున్నారని.. ప్రధాన కార్యాలయంలోనూ 30 శాతం మంది ఉద్యోగాలు గల్లంతేనని సోషల్ మీడియాలో ఆంధ్రజ్యోతి ఉద్యోగులు పెడుతున్న ఆర్తనాదాల సంగతేంటి..? ఈ ప్రశ్నలకు దమ్మున్న పత్రిక ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఏం సమాధానం చెబుతారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: