ఒకరోజు వ్యవధిలోనే రెండు మరణాలు.... ఆ ఇద్దరి మరణాలతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నిండిపోయింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్లు విగత జీవులుగా మారిపోవడంతో తల్లిదండ్రుల శోకానికి అవధులు లేకుండా పోయింది. వారు విలపిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది. ఒకే  ఇంటికి చెందిన అక్క చెల్లెలు రోజుల వ్యవధిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది. గుంటూరు జిల్లలో  ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కూతుర్లు మృతితో ఆ తల్లిదండ్రులకు తీరని శోకం నిండిపోయి గుండెలు పగిలేలా ఏడ్చారు . వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా శ్యామల పురం మండలం బొందిలిపాలెం కొత్త కాలనీలో ఎడవల్లి వెంకట్రావు లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. 

 

 

 ఇద్దరి దంపతులకు ప్రవళిక (6) మోక్షిత(4)  ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే తల్లిదండ్రులు కూతురే లోకంగా బతుకుతున్నారు. ఏ చిన్న కష్టం రాకుండా కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు . అయితే సోమవారం ఎప్పటిలాగే ఇంట్లో భోజనం చేసి ఇద్దరు కూతుర్లు ఆడుకున్నారు. కాగా ఉన్నట్టుండి మంగళవారం ప్రవళిక కు వాంతులు-విరేచనాలు మొదలయ్యాయి... దీంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు హుటా  హుటిన శావల్యాపురం లోనే ఓ ప్రైవేటు డాక్టర్ వద్దకు తీసుకెళ్లి అక్కడ చికిత్స చేయించారు. 

 

 అయినప్పటికీ ప్రవళిక ఆరోగ్య పరిస్థితి లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే మరింత అనారోగ్యం పాలైన పెద్ద కూతురు ప్రవళిక బుధవారం మృత్యువాత పడింది. ఇక అదే సమయంలో చిన్న కూతురు మోక్షిత కి సైతం వాంతులు-విరేచనాలు రావడం మొదలయ్యాయి.. దీంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులు మోక్షిత ను స్థానిక ఆసుపత్రిలో చూపించారు. ఇక అక్కడి వైద్యులు మోక్షిత కి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి సిఫారసు చేశారు. ఇక వైద్యులు చెప్పిన విధంగా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి మోక్షితను  తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఇక అక్కడి వైద్యులు మోక్షిత కి వైద్య పరీక్షలు చేయగా... మోక్షిత శరీరంలో అవయవాలు సరిగా పనిచేయడం లేదని తెలిపారు . దీంతో మోక్షిత్ సైతం  శుక్రవారం సాయంత్రం కన్నుమూసింది. అల్లారు  ముద్దుగా పెంచుకున్న ఇద్దరు కూతుర్లు కళ్ళముందే చనిపోవడంతో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: