మరో రెండు రోజుల్లో కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ గడువు ముగియనుంది. కేంద్రం లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకు పొడిగించనుందని సోషల్, వెబ్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించినా ఆంక్షల నుంచి విమానయాన రంగాన్ని మినహాయించవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు మోదీ లాక్ డౌన్ ను ప్రకటించక మునుపే నిలిచిపోయాయి. 
 
లాక్ డౌన్ అమలు వల్ల రైళ్ల, బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికుల అవస్థలు అన్నీఇన్నీ కావు. కేంద్ర ప్రభుత్వం దగ్గర లాక్ డౌన్ ను పొడిగించినా పౌర విమానయాన రంగానికి సడలింపులు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం విమానయాన రంగానికి అనుమతి ఇవ్వనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిందాల్సి ఉంది. ఇప్పటికే పలు విమానయాన సంస్థలు ఏప్రిల్ 15 నుంచి ప్రయాణికులు టికెట్లు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాయి. 
 
కేంద్రం లాక్ డౌన్ వల్ల అంతర్జాతీయ, దేశీయ విమానయాన సంస్థలపై ఆంక్షలు విధించడం వల్ల ఏవియేషన్ ఇండస్ట్రీ భారీ నష్టాలను చవి చూస్తోంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ డేటా ప్రపంచవ్యాప్తంగా 14.1 శాతం డిమాండ్ తగ్గిపోయిందని చెప్పారు. దేశంలో పలు విమానయాన సంస్థలు ఉద్యోగులు సెలవుపై వెళ్లాలని కోరగా మరికొన్ని సంస్థలు ఉద్యోగుల జీతాలలో కోత పెట్టాయి. 
 
కేంద్రం కార్గో, అత్యవసర సర్వీసులు తిరగడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కేంద్రం ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం ఇవ్వాలంటే విమానయాన సంస్థలకు అనుమతులు ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు దేశంలో వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండంటంతో కేంద్రం కరోనా కట్టడి కోసం మరిన్ని కీలక చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత 24 గంటల్లో 918 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది. అదే సమయంలో కరోనా భారీన పడి 31 మంది మృతి చెందారని పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: