కరోనా భారత దేశాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య వందలు దాటి వేలకు చేరుతోంది. ఈ సమయంలో రాష్ట్రాలు కూడా తమ శక్తి సామర్థ్యాల మేరకు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. కేసీఆర్, జగన్ తమ తమ శక్తి మేరకు కరోనా పై యుద్ధం చేస్తున్నారు. అయితే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రం జగన్, కేసీఆర్ ఇద్దరి పని తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.

 

 

కేసీఆర్ కాస్తలో కాస్త నయం.. ఆ జగనైతే మరీ దారుణం.. కేసీఆర్ ఏం చేస్తే అది చేసేస్తున్నాడు తప్ప సొంత బుర్ర వాడటం లేదు. అసలు కరోనా పై పోరాటం చేయాలి.. ప్రజలను కాపాడుకోవాలనే స్పృహే లేదు.. ఎంత సేపూ ఆ స్థానిక ఎన్నికల్లో గెలుపు గురించి తప్ప ఆయనకేమీ పట్టదు అన్నట్టు రాసుకొచ్చాడు. ఇంతకీ ఏం రాశాడో మీరే చూడండి..

 

" సొంతం గా ఆలోచించే అవసరం లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలనే తాను కూడా ప్రకటిస్తూ వచ్చిన జగన్మోహన్‌రెడ్డిలో ఇప్పుడు అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఈనెల ఐదవ తేదీన తొమ్మిది నిమిషాలపాటు ఇంటి బయటకు వచ్చి కొవ్వొత్తులు వెలిగించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపులో భాగంగా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న జగన్మోహన్‌రెడ్డిని గమనిస్తే ఆయన ఎంత అసహనంగా ఉన్నారో తెలుస్తుందని రాసుకొచ్చారు ఆర్కే..

 

 

ఆరోజు.. ఇంటి వెలుపలకు మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన జగన్మోహన్‌రెడ్డి తొమ్మిది నిమిషాలు కూడా పూర్తికాక ముందే లోపలకు వెళ్లిపోవడానికి రెండు మూడు పర్యాయాలు ప్రయత్నించారు. అధికారులు వారించడంతో ఆగిపోయారు..అంటూ రాసుకొచ్చారు. అంతే కాదు.. లాక్‌డౌన్‌ ఎత్తేసినా మరికొంత కాలంపాటు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని జగన్మోహన్‌రెడ్డి ఉవ్విళ్లూరడాన్ని ఏమనుకోవాలి? అంటూ నిలదీశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: