కొత్త‌గా పెళ్ళైన దంప‌తులు తెల్ల‌వారు జామున శృంగారంలో పాల్గొంటే చాలా మంచిదంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. ఉద‌యం స‌మ‌యంలో శ‌రీరం అనేది చాలా తేలిక‌గా ఉంటుంద‌ని రాత్రిపూట ఎక్కువ‌గా అలిసిపోకుండా త్వ‌ర‌గా ప‌డుకుని తెల్ల‌వారు జామున లేచి శృంగారంలో పాల్గొంటే చాలా మంచిదంటున్నారు. అలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరం కూడా చాలా రిలాక్స్‌గా ఉంటుంద‌న్నారు. శృంగారంలో పాల్గొనాల‌న్న ఇంట్ర‌స్ట్ ఉండాలేగాని సెక్స్‌లో పాల్గొన‌డానికి ఏ స‌మ‌య‌మైనా స‌రే దంప‌తుల‌కు శుభ‌వేళ‌లే అంటున్నారు.

 

అలాగే తెల్ల‌వారుజామున శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల ఎక్కువ స‌మ‌యం సెక్స్ చేయ‌వ‌చ్చు అంటున్నారు ప‌రిశోధ‌కులు. అలాగే ఆరోగ్య రిత్యా కూడా చాలా మంచిద‌ని అంటున్నారు. శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల శ‌రీరంలోని హార్మోన్లు కూడా బ్య‌లెన్స్డ్‌గా ఉంటాయ‌ని చెపుతున్నారు. అలాగే ఉద‌యం పూట సెక్స్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో బీపీ అనేది రాద‌ని అంటున్నారు. అలాగే శ‌రీరం కూడా చాలా తేలిక‌గా ఉంటుంద‌ని దాని వ‌ల్ల మ‌న శ‌రీరంలో కొవ్వు శాతం కూడా బాగా త‌గ్గుతుంద‌ని అధిక కేల‌రీలు బ‌ర్న్ అవుతాయని అంటున్నారు. అలాగే ఉద‌యాన్నే చేయ‌డం వ‌ల్ల అది భార్యాభ‌ర్త‌లిద్ద‌రికీ కూడా ఎక్స్‌ర్‌సైజ్‌లాగా ఉంటుంద‌న్నారు.

 

అంతేకాక రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుందంటున్నారు. అంతేకాక‌ శరీరంలో ఆక్సిటోసిన్ విడుదల అవడంతో రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు దోహదపడుతుందని, తద్వారా దంపతులు పగటి పూట ఉరకలేసే ఉత్సాహంతో పనిచేసుకోవచ్చని పరిశోధనలు తేల్చుతున్నాయి. అంతేకాక మెద‌డు కూడా బాగా రిలాక్స్ అయి చురుకుగా ప‌నిచేస్తుంద‌న్నారు. శ‌రీరం, మైండ్ రెండూ రిలాక్స్ అవ్వ‌డం వ‌ల్ల మ‌నిషికి చాలానే ఉప‌యోగాలున్నాయ‌న్నారు. కాబ‌ట్టి సెక్స్ అనేది రాత్రి వేళల‌కంటే తెల్ల‌వారు జామున చేయ‌డం చాల మంచిదంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. కానీ ఈ స‌మ‌యంలో సెక్స్ చేయ‌డానికి చాలా మంది ఇంట్ర‌స్ట్ చూపించ‌రు. నిద్రకి భంగం క‌లుగుతుంద‌ని చాలామంది దంప‌తులు ఆ స‌మ‌యాన్ని పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు. రాత్రి పూట ఏదో మొక్కుబ‌డికి శృంగారంలో పాల్గొంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: