యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా... ప్రపంచ దేశాలకు పెద్ద అన్నగా పిలవబడే దేశం అమెరికా. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు భారతదేశం సరఫరా చేసిన హైడ్రాక్సి క్లోరోక్విన్ టాబ్లెట్లు అమెరికాకి చేరుకున్నాయి. అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరం ఎయిర్ పోర్ట్ కు సదరు మెడిసిన్ పంపిన విమానం చేరుకుందని అమెరికాలో ఉన్న భారత రాయబారి తరన్ జిత్ సింగ్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు విజ్ఞప్తి మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సదరు టాబ్లెట్లు ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ పరిస్థితుల్లో మొత్తం 35.82 లక్షల టాబ్లెట్లను అమెరికాకు పంపించారు. ఇందులో భాగంగానే తొలి విడతగా ప్రస్తుతం అమెరికాకు భారత్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లను పంపింది.

 


అయితే హైడ్రాక్సి క్లోరోక్విన్ మందులను పంపినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా నుండి ఎంతో మంది ప్రముఖులు భారత్ కు రుణపడి ఉంటామని తెలిపారు. అలాగే అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.. ఈ హైడ్రాక్సి క్లోరోక్విన్ మందుని కరోనా వైరస్ చికిత్స కోసం వాడవచ్చని గతంలో తెలియజేసింది. దానితో అమెరికా అధ్యక్షుడు ఆ మందులు కావాలని నరేంద్ర మోడీని విజ్ఞప్తి చేశారు. ఈ మందును ఒక్క అమెరికాకు మాత్రమే కాకుండా మిగతా దేశాలకి కూడా భారత్ సరఫరా చేయనుంది.

 


ఇక్కడ ఎందుకు అంతలా చేస్తున్నారు అంటే... ప్రపంచం మొత్తం మీద ఆ హైడ్రాక్సి క్లోరోక్విన్ టాబ్లెట్లు ఒక్క భారతదేశంలోనే 70 శాతం వరకు తయారు కావడం విశేషం. అయితే అమెరికాకు ఒక టాబ్లెట్లతో మాత్రమే కాకుండా అందుకు అవసరమయ్యే ముడిపదార్థాల కూడా అమెరికాకు పంపుతుంది. దీనితో ఆ టాబ్లెట్స్ ను అమెరికాలో ఉన్న కరోనా రోగులకు మొదటి రోజు రెండు పూటలా 400 mg డోసులో ఇవ్వబోతున్నారు. మరి రెండు రోజుల నుంచి రెండు పూటలా 200 mg డోసులో మొత్తం 10 రోజుల వరకు ఈ మందును రోగులకు ఇవ్వబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: