ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న రాత్రి నుంచి ఈరోజు సాయంత్రం వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరు లో 7, నెల్లూరు లో 4, కర్నూల్ లో 2, చిత్తూరు మరియు కడప జిల్లాలో ఒక్కొక కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 15 కేసులతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 420 కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
 
రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 84 కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లాలో 82 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో ఏపీ ప్రభుత్వం ఈ రెండు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ జిల్లాలలో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో 11 జిల్లాలలో ఇప్పటివరకూ కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రజల సహకారం, అధికారులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఉండటంతో కొత్త కేసులు నమోదు కావడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం కొత్త కేసులు నమోదు కాకుండా తగిన చర్యలు చేపడుతోంది. ఏపీ సీఎం జగన్ ఈరోజు ఉన్నతాధికారులతో కరోనా నియంత్రణ కోసం సమీక్ష చేశారు. 
 
ఈ సమీక్షలో జగన్ రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి మూడు మాస్కుల చొప్పిన పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 16 కోట్ల మాస్కుల పంపిణీ జరగనుంది. అధికారులు ఈ మేరకు చర్యలు చేపడుతున్నారు. అతి త్వరలో మాస్కుల పంపిణీ జరగనుందని తెలుస్తోంది. ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో కేంద్రాల ఆదేశాలను పాటించనుందని సమాచారం. ఏపీలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ అమలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: