ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య 400దాటింది. అయితే పరిస్థితి ఇలా ఉన్నా సీఎం జగన్ మాత్రం స్థానిక ఎన్నికలపైనే ఉందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కరోనా పరిస్థితి ఇంత భయంకరంగా ఉన్నా.. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ను ఉన్నపళంగా పదవీ కాలం కుదించేసి ఇంటికి పంపించేశారు.

 

 

దీనికి తోడు ఇటీవల ప్రధాన మంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో రెడ్ జోన్లు మినహాయించి మిగిలిన చోట్ల లాక్ డౌన్‌ ఎత్తేస్తే మంచిదని సలహా ఇచ్చారు. దీంతో ఇంకా జగన్ కన్ను స్థానిక ఎన్నికల పైనే ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మరో విశేషం ఏంటంటే.. జగన్ స్థానికల గురించి ఆలోచిస్తుంటే.. దక్షిణ కొరియాలో ఏకంగా ఆ దేశ పార్లమెంటు ఎన్నికలే నిర్వహిస్తున్నారన్న విషయం ఆసక్తి రేపుతోంది.

 

 

దక్షిణ కొరియాలో ఇప్పటి వరకూ 10 వేలకుపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 214 మంది చనిపోయారు కూడా. ఏకంగా ఆ దేశం మంత్రి ఒకరు క్వారంటైన్ లో ఉన్నారు కూడా. అయినా సరే దక్షిణ కొరియాలో యథావిధిగా పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వచ్చే బుధవారం జరగనున్న ఈ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం పాటించడం , ఎన్నికల అధికారులకు అన్ని రకాల రక్షణ పరికరాలు, మాస్కులు, సూట్ లు ఇవ్వడం చేస్తున్నారు. దక్షిణ కొరియాలో మొత్తం 14 వేల పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేశారు. జనం దూరంగా నిలుచునేలా మార్కింగ్ చేస్తున్నారు.

 

 

ఇప్పుడు ఈ వార్త చూసి.. జగన్ క దక్షిణ కొరియా ఆదర్శం కాబోతోందా.. ఆయనకు మార్గదర్శనం చేస్తోందా అన్న విశ్లేషణలు వస్తున్నాయి. మరి జగన్ అంత పని చేస్తారా.. లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: