జగన్ అంటేనే మాట ఇస్తే వెనక్కి తగ్గని రకం. దాని కోసం ఆకాశాన్ని భూమిని కూడా ఆయన కలిపేస్తారు. జగన్ ఏ విషయంలో అసలు తగ్గరు. ఆయన అనుకున్నది సాధించి తీరుతారు అంటారు. ఆయన సన్నిహితులు దాన్ని పట్టుదల అని పేరు పెడితే ప్రత్యర్ధులు మొండి అంటారు.

 

ఇపుడు జగన్ లాక్ డౌన్ సడలిస్తానని అంటే దానికి కూడా ఎన్నో అర్ధాలు వెతుకుతున్నారుట. నిజానికి ఏపీలో కేసులు ఎక్కువయ్యాయి. మూడు జిల్లాలు చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి. కేసులు కూడా చాలా  ఉన్నాయి. అయినా సరే జగన్ లాక్ డౌన్ సడలించాలని అంటున్నారు. దానికి ఆయన చెబుతున్న కారణం ఆర్ధిక వ్యవస్థ ఇబ్బందులో పడుతుందని, ఏపీ ఒక్కసారిగా కుప్పకూలుతుందని కూడా జగన్ చెబుతున్నారు.

 

కానీ ఇదే విషయంలో ప్రత్యర్ధి తెలుగుదేశం ప్రచారం వేరేగా ఉంది. జగన్ ఈ నెల 28 నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖ వెళ్ళాలను భావిస్తున్నాడని, మొత్తం సచివాలయం అక్కడికి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారని, అందుకోసమే లాక్ డౌన్ సడలిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపిస్తున్నారు.

 

ఇదిలా ఉండగా కరోనా వైరస్ వల్ల  జగన్ మాత్రం తన యాక్షన్ ప్లాన్ కంప్లీట్ గా డిస్టర్బ్ అయిందన్న బాధలో ఉన్నారన్నది తెలిసిందే. ఆయన అనుకున్నది ఒకటైతే జరిగేది వేరుగా ఉంటోంది. నిజానికి ఉగాదికి విశాఖలో పట్టాల పంపిణీ చేయాలన్నది జగన్ ఉద్దేశ్యం. అదే విధంగా విశాఖలో సచివాలయ ఉద్యోగులను  తరలించి  విద్యా సంవత్స‌రం మొదలయ్యేనాటికి మొత్తం రాజధాని షిఫ్ట్ కధను ముగించాలను అనుకున్నారు.

 

ఈ లోగా లోకల్ బాడీ ఎన్నికలు కూడా పూర్తి చేసుకుంటే రానున్న నాలుగేళ్ళ కాలం తిరుగు ఉండదని భావించారు. కానీ జరుగుతున్నది పూర్తిగా వేరుగా ఉంది. దాంతో జగన్ ఇపుడు ఇబ్బందులు పడుతున్నారని ప్రచారం ఓ వైపు సాగుతోంది. దానికి మసాలా తగిలించి దేవినేని టైమ్, డేట్ కూడా చెప్పేశారు. అయితే ఇది  జగన్ అనుకున్నదా, దేవినేని జోస్యమా అన్నది తొందరలోనే తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: