దేశంలో కరోనాని కట్టడి చేయడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కరోనా గురించిన చర్చలే జరుపుతున్నారు.  అయితే కరోనాని తెలుగు రాష్ట్రాల్లో కరోనాని సాధ్యమైనంత వరకు కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  కరోనా పరిస్థితుల గురించి ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.  తాజాగా ఏపిలో కరోనా కేసులు రోజూ పెరిగిపోతూనే ఉన్నాయి.  రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది.

 

శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు నిర్వహించిన పరీక్షల్లో 15 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 420కి చేరింది.  ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో ఆరుగురు మరణించారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 84 కేసులు వెల్లడి కాగా, గుంటూరు జిల్లా 82 కేసులతో రెండో స్థానంలో ఉంది.

 

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా కొనసాగుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో కరోనా కేసులేమీ లేవు.గుంటూరు జిల్లాలో 7, నెల్లూరు జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 2, కడప జిల్లాలో  1, చిత్తూరు జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: