దేశంలో ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పోలీసులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం లాక్ డౌన్ నిబంధనలు పదేపదే ఉల్లంఘిస్తూ ఉండటంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈరోజు  ఒక యువతి లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించడంతో పాటు.... పోలీసులతో వాగ్వాదానికి దిగింది. 
 
ఢిల్లీలోని వసంత్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు మాస్క్, గ్లౌజులు లేకుండా బయటకు వస్తే కరోనా సోకే ప్రమాదం ఉందని యువతికి సూచించారు. పోలీసులు ఎంత చెప్పినా యువతి మాత్రం వినిపించుకోకుండా పోలీసులతో గొడవకు దిగింది. నిన్న సాయంత్రం యువతి మాస్క్, గ్లౌజులు ధరించకుండా రోడ్డుపైకి వచ్చింది. బయటకు మాస్క్ ధరించకుండా రావొద్దని.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయని పోలీసులు సూచించారు. 
 
యువతి నేను మాస్క్ పెట్టుకోవాలో... వద్దో చెప్పడానికి నువ్వు ఎవరు అంటూ పోలీసులను ప్రశ్నించింది. ఆ ప్రశ్న విని షాక్ అవ్వడం పోలీసుల వంతయింది. అనంతరం యువతి పోలీసుల వివరాలను నోట్ చేసుకొని మీ సంగతి చెబుతా అంటూ వారికి వార్నింగ్ ఇచ్చింది. యువతి విచిత్ర ప్రవర్తనతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు పాటించని యువతిపై కేసు నమోదు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.                    
 
స్థానిక కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు కూడా అక్కడికి చేరుకుని యువతికి నచ్చజెప్పినా యువతి వారి మాటలు కూడా వినిపించుకోలేదని సమాచారం. పోలీసులు తాము కరోనా కట్టడి కోసం ఎంతో కృషి చేస్తున్నామని.... రాత్రింబవళ్లు ఎంతో కష్టపడుతున్నామని.... తాము మంచి చెప్పినా యువతి ఇష్టానుసారం ప్రవర్తించిందని పేర్కొన్నారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: