ఎప్పటికి అప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ ఇటీవల ట్విట్టర్ వేదికగా #AskKTR అనే కార్యక్రమం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఇందులో భాగంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ తనదైన స్టైల్లో జవాబులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మంత్రి కేటీఆర్ ఏ చిన్న విషయం అయినా కూడా ట్విట్టర్ వేదికగా పోస్ట్ లు పెడుతూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. కాకపోతే, ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ తనదైన రీతిలో పంచ్ సమాధానం ఇవ్వడం జరిగింది. 

 

ఇక ఇది ఇలా ఉండగా తాజాగా కేటీఆర్ వేసిన పంచ్ పై రామ్ గోపాల్ వర్మ అనుకోని విధంగా స్పందన ఇవ్వడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే... రామ్ గోపాల్ వర్మ ఏం అడిగారంటే మద్యం సరఫరా గురించి అడిగిన సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మద్యాన్ని ఇళ్లకు డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని రాంగోపాల్ వర్మ ఆ ట్వీట్ లో తెలపడం జరిగింది. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులను ట్యాగ్ చేస్తూ వాళ్లని అడగడం జరిగింది. ఇక ఏమీ అడిగారు అన్న విషయానికి మీకు నాదొక విన్నపం ఎవరైతే బోర్ గా ఫీల్ అవుతూ చిన్న పిల్లల్లాగా ఏడుస్తున్నారో వారి కోసం మమతా బెనర్జీ లా పెద్ద మనసు ఉండాలి. అలాంటి పద్ధతినే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రవేశ పెట్టండి అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.


అయితే ఇందుకు గాను మంత్రి కేటీఆర్ తనదైన రీతిలో జవాబు ఇచ్చారు. " రాము గారు మీరు అడుగుతున్నది హెయిర్ కట్ గురించే కదా..." అంటూ ఆయనపై పంచ్ వేసాడు. దీనితో పాటు ఆలోచిస్తున్న ఎమోజి ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే... ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టిన వెంటనే ఇదే మొదటి హిట్ కావడం చాలా విశేషంగా మారింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ అభిమానులు వాళ్ల అభిమానాన్ని చాటుకోవడం జరిగింది. మరి కొంతమంది అయితే అభిమానులు వేసిన కేటీఆర్ చిత్రాన్ని జత చేయడంతో  మంత్రి కేటీఆర్ వాళ్ళకి ధన్యవాదములు తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం ఈ ట్వీట్ సంభాషణ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అనే చెప్పాలి.


అయితే ఈ క్రమంలో కేటీఆర్ పంచ్‌ పై ఆర్జీవీ తాజాగా స్పందించిన విధానం నిజంగా అందరిని ఆశ్చర్య వ్యక్తం చేసింది. మీ పంచ్‌ తో నా ముక్కు ఎర్రగా మారిందని రామ్ గోపాల్ వర్మ కేటీఆర్ ట్వీట్ కి బదులుగా ట్వీట్ బదులిచ్చారు. ‘‘కేటీఆర్ గారూ మీ సమాధానాన్ని మిస్ అయ్యాను. మీ సమయస్ఫూర్తి నచ్చింది. దాన్ని ఓ స్టీలు బాక్సులో పెట్టి నా ముక్కుపై గట్టిగా బాక్సింగ్ పంచ్ ఇచ్చినట్లు ఉంది. దీంతో నా ముక్కు ఎర్రగా మారిందని, అయితే, ప్రస్తుతం మీ ప్రభుత్వం చేస్తున్న పనులు చాలా బాగున్నాయి.’’ అని రామూ తనదైన శైలిలో స్పందించి అందరిని ఆశ్చర్యపరిచాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: