ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అధికారంలో తనకు నచ్చిన వాళ్ళు ఉంటే ఒకలాగా నచ్చని వారు ఉంటే మరొక లాగా వ్యవహరిస్తున్నారు. తనకు ఇష్టమైన నాయకుడు చంద్రబాబు అధికారంలో ఉంటే ప్రభుత్వం అంత చేస్తుంది, ఈ విధంగా చేస్తుంది అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో తెగ భజన చేస్తుంటారు. నచ్చని వారి అధికారంలో ఉంటే మాత్రం జర్నలిజం, ప్రజల గొంతు మీడియా అంటూ తెగ రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు పై ఈ విధంగానే వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఉద్దేశించి క్రిమినల్ సీఎం అంటూ తన పత్రికలో రెచ్చిపోయారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నీ పదవి నుంచి తొలగించడం లో జగన్ సర్కార్ అవలంభించిన తీరుపై ఏబీఎన్ రాధాకృష్ణ తన పత్రికలో తెగ బాధపడిపోతూ...ఏపీ ప్రభుత్వం పై పత్రికలో విషం చిమ్ముతున్నారు.

 

అసలు జగన్ లాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకోవటం ఆంధ్ర ప్రజలు చేసుకున్న కర్మ అంటూ తన తాజా శీర్షికలో ప్రచురించారు. దీంతో ఏబీఎన్ రాధాకృష్ణ వ్యవహరిస్తున్న యాటిట్యూడ్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రజల పక్షాన ఉంటూ నీతి సూత్రాలు చెప్పే రాధాకృష్ణ..ముఖ్యమంత్రిని ఎన్నుకునే జనాలను కూడా ఏవిధంగా ఉండాలో చెప్పే అంత స్థాయికి ఎదిగిపోయారా..? అంటే చాలామంది మండిపడుతున్నారు.

 

ప్రజలు ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలో చెప్పే అంత స్థాయి రాధాకృష్ణకి ఏమాత్రం లేదని రాధాకృష్ణ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. కేవలం తన వర్గానికి చెందిన నాయకులు అధికారంలో ఉండాలని రాధాకృష్ణ భావిస్తే మాత్రం తన కంట్లో తానే పొడుచుకుంటున్నటు అవుతుందని విమర్శిస్తున్నారు. ఈ విధంగా పత్రిక అడ్డంపెట్టుకుని తన ఉద్దేశాలు కరెక్ట్ అని ప్రజలపై రుద్దితే ఆయనకే నష్టం వాటిల్లే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: