ఏపీలో కరోనా వైరస్ ప్రభావం ఎంతలా ఉందో తెలిసిందే. రోజురోజుకూ కరోనా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక కరోనా ప్రభావం కంటే దాని మీద రాజకీయం చేయడం మరింతగా ఎక్కువగా ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు దీనిపై మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఇదే సమయంలో మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయం ఏపీ రాజకీయాలు మరింత హీట్ అయ్యేలా చేసింది.

 

కరోనా ప్రభావం నేపథ్యంలో తమని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేశారని చెప్పి, జగన్ ప్రభుత్వం సైలెంట్ గా ఎలక్షన్ కమిషనర్ నియామక అర్హతపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి, దాన్ని గవర్నర్ చేత ఆమోద ముద్రవేయించుకున్నారు. ఇక దాని వల్ల ఐదేళ్లు ఉండాల్సిన రమేష్ పదవీకాలం మూడేళ్లకు ముగిసింది. దీంతో ఆయన్ని వెంటనే తప్పించి, తమిళనాడుకు చెందిన కనగరాజ్ ని కొత్త కమిషనర్ గా నియమించేసారు.

 

దీంతో రమేష్ కుమార్ కూడా వెనక్కి తగ్గకుండా పోరాటం చేయడానికి ఫిక్స్ అయ్యారు. తనను ఈసీగా తొలగించడంపై హైకోర్టులో నిమ్మగడ్డ రిట్ పిటిషన్ వేశారు. ఆర్టికల్ 243కే ప్రకారం తనను తొలగిస్తూ జారీ చేసిన జీఓ రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న సమయంలో ఈసీని మారుస్తూ..ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని పిటిషన్‌లో తెలిపారు.

 

అయితే ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో అనుకూల తీర్పు వచ్చిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలోనే రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తుందని టీడీపీ నేత దేవినేని ఉమా జోస్యం చెప్పారు. పైగా ఈ దెబ్బతో జగన్ ఉద్యోగం ఊడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని కామెంట్ చేసారు.

 

అంటే జగన్ సీఎం పదవీ పోతుందని ఉమా పరోక్షంగా మాట్లాడుతున్నారు. అసలు ఈ కామెంట్ కు ఎలాంటి లాజిక్ లేదు. ఇదొక అర్ధంపర్ధం లేని కామెంట్ అని అందరికి అర్ధమవుతుంది. ఎదో ఉమా నోటికి ఎంత వస్తే అంత చెప్పేస్తారు కాబట్టి, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఉద్యోగం పోతుందనే మాట వింటే ఫుల్ కామెడీగా ఉంది. అలాగే రాజ్యాంగబద్దంగా ఎలక్షన్ కమిషనర్ వ్యవహారం జరిగింది. కాబట్టి హైకోర్టు కూడా దీనిపై పెద్దగా కలుగజేసుకుని అవకాశాలు లేవని తెలుస్తోంది. ఏదేమైనా ఎలక్షన్ కమిషనర్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బందులు రాకపోవచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: