కరోనా ప్రభావం లేకముందు ఏపీలో జంపింగ్ పాలిటిక్స్ నడిచిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో చాలామంది టీడీపీ నేతలు వరుస పెట్టి వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక టీడీపీ అధికారం కోల్పోయిన మొదట్లో కొందరు నేతలు బీజేపీలోకి కూడా వెళ్లారు. అయితే అప్పటి నుంచి అనంతపురం జిల్లాలో కీలక పాత్ర పోషించే జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ కూడా బీజేపీలోకి వెళుతుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

 

దానికి తోడు జేసీ ఫ్యామిలీని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే  బీజేపీ ఆహ్వానించినా తాము పార్టీ ప్రసక్తి లేదని జేసీ చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. ఇక ఎన్ని సార్లు చెప్పిన, జేసీ ఫ్యామిలీ పార్టీ మారుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కూడా బీజేపీ ఎంపీ సీఎం రమేష్, జేసీని వ్యక్తిగతంగా కలిశారు. దీంతో మరోసారి జేసీ ఫ్యామిలీ జంప్ అయిపోతుందని వార్తలు వచ్చాయి.

 

ఈ క్రమంలోనే జేసీ మరోసారి పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ నుంచి తనకు ఆహ్వానం ఎప్పుడో వచ్చిందని, తమ కుటుంబానికి ఒక చరిత్ర ఉందని, ఎట్టి పరిస్థితిలో బీజేపీలో చేరనని స్పష్టం చేశారు. అయితే జేసీ ఫ్యామిలిలో పవన్ కుమార్ రెడ్డి చేతిలోనే పార్టీ మార్పు నిర్ణయం ఆధారపడి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం జేసీ దివాకర్ వయసురీత్యా పోటీ నుంచి తప్పుకున్నారు. అటు జేసీ ప్రభాకర్ కూడా పోటీ నుంచి తప్పుకుని తన తనయుడు అస్మిత్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.

 

అయితే ప్రస్తుతం జేసీ ఫ్యామిలిలో పవన్  కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక పవన్ ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వం మీద పాజిటివ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే తమ ట్రావెల్స్, ఇతర అంశాల్లో జగన్ ప్రభుత్వం జేసీ ఫ్యామిలీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలోకి వెళితే  బెటర్ అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పైకి పార్టీ మారడం లేదని చెప్పినా, పరిస్థితులని బట్టి పార్టీ మారే అవకాశముందని టాక్. కానీ టీడీపీని వీడటానికైతే పవన్ సిద్ధంగా లేరని, కాకపోతే పరిస్థితులుని బట్టి పార్టీ మార్పు ఉంటుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: