ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్  విజృంభిస్తుంది . ముఖ్యంగా అగ్ర రాజ్యాలైన అమెరికా స్పెయిన్ జర్మనీ లాంటి దేశాల్లో అయితే మరణమృదంగం మోగిస్తోంది ఈ మహమ్మారి వైరస్. రోజురోజుకు ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే ఇప్పటికే అగ్రరాజ్యాలు పదుల వేల సంఖ్యలో కరోనా  కేసులు నమోదయ్యాయి.. మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. అయితే ఈ మహమ్మారి వైరస్ ప్రభావం భారతదేశంలో కూడా ఉన్న విషయం తెలిసిందే. భారతదేశంలో 130 కోట్ల జనాభా ఉన్నప్పటికీ కేవలం ఆరువేల కరోనా  పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైంది. దీనికి కారణం అలుపెరగకుండా పోరాటం చేస్తున్న డాక్టర్లు పోలీసులు. 

 

 ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రాణాలకు తెగించి రోడ్లమీద గస్తీ కాస్తూ ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఇళ్లకే పరిమితం కావాలి అని సూచిస్తున్నారు. అక్కడక్కడా వినని వాళ్ళ పై లాఠీ చార్జీ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే పోలీసులు ప్రజల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో... ప్రజలకు  పోలీసులు విలన్ లాగా  చూస్తున్నారు. మామూలుగానే పోలీసులను ప్రజలకు  విలన్ గా చూస్తారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కనిపించినప్పుడల్లా ఏదో ఒకటి లేదు అని ఫైన్ వేస్తూ ఉంటారు పోలీసులు. 

 

ఇక ఇప్పుడు కరోనా తో ప్రాణభయం  ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యం కోసమే ఆలోచిస్తున్నప్పటికీ పోలీసులు ప్రజలకు విలన్ గానే కనిపిస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ప్రజలు పోలీసులు ఎంత ఇబ్బందులకు గురిచేస్తున్నారు అన్నది అర్థం అవుతోంది. ఎంతో మంది పోలీసులు ఇంటికి వెళ్లి ప్రాణాలు రక్షించుకోవాలని ఇక్కడ వీడియోలు ఉన్నవారికి సూచిస్తున్న కొడుకు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అందుకే అనవసరంగా పోలీసులు తిట్టుకోకండి అని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: